హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్‌ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి అదిరిపోయే హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాను మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి హీరోయిన్ లేకుండానే నటించాడు. తన నటనతో మెప్పించి అదిరిపోయే హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

బాలకృష్ణ:
బాలకృష్ణ కూడా తన కెరియర్ మొదట్లో కొన్ని సినిమాలు హీరోయిన్ లేకుండా నటించారు. బాలకృష్ణ హీరోగా వేములవాడ భీమకవి అనే సినిమాలో న‌టించాడు. ఈ సినిమాలు ఆయన హీరోయిన్ లేకుండా నటించాడు. తర్వాత శ్రీ వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో నారదుడు పాత్రలో హీరోయిన్ లేకుండానే నటించాడు. గత ఏడాది వచ్చి నా అఖండ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన బాలకృష్ణ అందులో అఘోర పాత్రకు హీరోయిన్ లేకుండా నటించి సూపర్ హిట్ కొట్టాడు.

నాగార్జున:
నాగార్జున ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన హీరోయిన్ లేకుండా షిరిడి సాయి సినిమాలో సాయిబాబా పాత్రలో నటించారు ఇందులో నాగార్జునకు హీరోయిన్ లేదు. గగనం, రాజు గారి గది 2, ఆఫీసర్ వంటి సినిమాలు హీరోయిన్ లేకుండా నాగార్జున నటించాడు.

వెంకటేష్:
టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాల హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకటేష్. వెంకటేష్ కూడా హీరోయిన్లతో ఎన్నో సినిమాలు నటించి సూపర్ హిట్ కొట్టాడు. వెంకటేష్ ఈనాడు సినిమాలో మాత్రం హీరోయిన్ లేకుండా నటించి మంచి హిట్ కొట్టాడు.

కమల్ హాసన్:
లోక నాయకుడు కమలహాసన్ కూడా హీరోయిన్ లేకుండా సినిమాల్లో నటించి సూపర్ హిట్ట్ కొట్టారు. ఆయన నటించిన సినిమాలు ఏమిటంటే తాజాగా వచ్చిన విక్రమ్‌ సినిమాలో హీరోయిన్ లేకుండా నటించి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు కమలహాసన్.

Share post:

Latest