విశ్వ‌క్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భ‌య‌ప‌డ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!

`పాగ‌ల్‌` త‌ర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్క బాధ్య‌త‌లు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా పేతురాజ్‌.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. విశ్వ‌క్ కు సంబంధించి ప‌లు సీక్రెట్స్ లీక్ చేశారు. క‌థ చెప్ప‌గానే న‌చ్చి వెంట‌నే ఓకే చేశాన‌ని.. కొద్ది రోజుల త‌ర్వాత క‌థ మారింది, విశ్వ‌క్ సేన్ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని చెప్ప‌డంతో చాలా భ‌య‌ప‌డ్డా. కానీ, మ‌రోసారి క‌థ విన‌గా అది ఇంకా బాగా న‌చ్చింది. దాంతో మా ప్ర‌యాణం మొద‌లైంది అంటూ నివేదా చెప్పుకొచ్చింది.

విశ్వ‌క్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ఆమె మాట్లాడుతూ.. `హీరోలు నిర్మాతలుగా మారడం చూశా, కానీ విష్వక్‌ దర్శకత్వం కూడా చేశాడు. త్రివిక్రమ్‌ సర్‌ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో అంతటి ఎనర్జీని చూసింది విష్వక్‌లోనే. అందుకే ఇత‌ర హీరోల‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పా. బాల‌కృష్ణ వంటి అగ్ర హీరోల‌తో తాను సినిమా చేస్తే బాగుంటుంది. అలాగే గ్యాంగ్‌స్టార్ సినిమాలంటే విశ్వ‌క్ కు పిచ్చి. క‌మ‌ల్ సార్ ను లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎంత మాస్‌గా చూపించారో.. అలా అత‌ను కూడా చూపించ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. దీంతో విశ్వ‌క్ ను బాగానే అర్థం చేసుకున్నావ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Share post:

Latest