ఆ మాట అన్న‌వాడికి మూతి ప‌గిలేలా స‌మాధానం ఇచ్చిన ఉపాస‌న‌..!

మెగా కోడ‌లు, రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న త్వ‌ర‌లోనే పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పెళ్లి అయిన ప‌ది ఏళ్ల త‌ర్వాత ఉపాస‌న గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ శుభ‌వార్తతో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

అయితే బేబీ బంప్ క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఉపాస‌న స‌రోగ‌సి ద్వారా త‌ల్లి కాబోతోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ మాట అన్న‌వాడికి మూతి ప‌గిలేలా స‌మాధానం ఇచ్చింది ఉపాస‌న‌. ఆరు నెల‌ల గ‌ర్బ‌వ‌తి అయిన ఉప‌సాన తాజాగా మొద‌టిసారి త‌న బేబీ బంప్ ను రివీల్ చేసింది.

నిన్న రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. అయితే ఈ వేడుక‌ల్లో బ్లూ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించిన ఉపాస‌న‌.. తొలిసారి బేబీ బంప్ తో చూపిస్తూ ఫోటోల‌కు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఆమె ఫోటోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మొత్తానికి తాను స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌న‌డం లేద‌ని ఉపాస‌న ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేసింది.

https://twitter.com/TakeOneFilmy/status/1640423403529342977?s=20