అనంతలో లోకేష్ దూకుడు..పట్టు పెంచుతారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఆయన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. పాదయాత్రకు ప్రజలు నుంచి స్పందన బాగా వస్తుంది. ఇక లోకేష్ సైతం దూకుడుగా ముందుకెళుతూ..వైసీపీ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. ఇలా తనదైన శైలిలో లోకేష్ ముందుకెళుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు అనంతలో స్పందన బాగుంది.

ఇక లోకేష్ దాదాపు అన్నీ  నియోజకవర్గాలు కవర్ చేసేలా పాదయాత్ర చేయనున్నారు. దీని వల్ల జిల్లాలో టి‌డి‌పి బలం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని టి‌డి‌పి శ్రేణులు అంచనా వేస్తున్నాయి. మొన్నటివరకు ఉమ్మడి చిత్తూరులో లోకేష్ పాదయాత్ర జరిగింది. అక్కడ కొంతమేర పార్టీ బలం పెరిగింది. ఇప్పుడు అనంతలో సైతం టి‌డి‌పికి పట్టు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మామూలుగా జిల్లాలో టి‌డి‌పికి బలం ఎక్కువ. కానీ గత ఎన్నికల్లో కేవలం  2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అక్కడ నుంచి టి‌డి‌పి నిదానంగా బలపడుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది.

ఇదే క్రమంలో ఇటీవల సర్వేల్లో టి‌డి‌పి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే ఇంకా టి‌డి‌పి బలం పెరగాల్సిన అవసరం ఉంది. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టి‌డి‌పి 12 సీట్లు గెలుచుకుంది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ స్థాయిలో సీట్లు గెలవాలని టి‌డి‌పి టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు లోకేష్ పాదయాత్ర కాస్త హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చేస్తున్న పుట్టపర్తిలో వైసీపీకి ఆధిక్యం ఉంది..మరి లోకేష్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఆధిక్యం ఏమైనా మారుతుందేమో చూడాలి. మొత్తానికి లోకేష్ పాదయాత్ర ప్రభావం వల్ల అనంతలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుందేమో చూడాలి.