“ఆ రెండే చరణ్ కి పెద్ద ఆయుధాలు”.. అబ్బాయ్ కి బాబాయ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గిఫ్ట్..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫొటోస్ వీడియోస్ తో ఇందస్ట్రీ మొత్తం షేక్ అయిపోతుంది . దానికి మెయిన్ రీజన్ ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు . నేడు తన 38వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు.. అభిమానులు .. రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ ను అందజేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కి ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బాబాయ్ అఫీషియల్గా జనసేన తరఫున రాంచరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు . “అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ” అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . “ఎన్నెన్నో విజయాలు అందుకొని ఇంకా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ ఆశీర్వదించారు .

అంతేకాదు దైవచింతన.. ప్రశాంతత చిత్తం కలిగిఉన్న చరణ్ కి ఉన్న రెండు ఆయుధాలు క్రమశిక్షణ .. వృత్తి పట్ల నిబద్ధత అంటూ చరణ్ ఓ రేంజ్ లో పొగిడేశారు . కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలలో రామ్ చరణ్ నటిస్తాడు అని ఆశాభావం వ్యక్తం చేశాడు . దీనితో రామ్ చరణ్ పై పవన్ కళ్యాణ్ కున్న ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు చరణ్ కి పవన్ కి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధం కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చరణ్ కి ఎంతో ఇష్టమైన కాస్ట్లీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడని కూడా తెలుస్తుంది..!!