`ధ‌మ్కీ`తో హిట్ కొట్టిన విశ్వ‌క్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ రీసెంట్‌గా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు.

నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా స‌రే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూదీ దుమ్ము దులిపేస్తోంది. విడుద‌లైన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. లాభాల బాట ప‌ట్టింది. 5వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్ ను రాబ‌ట్టింది. ఏరియాల వారీగా దాస్ కా ధ‌మ్కీ 5 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 3.22 కోట్లు
సీడెడ్: 1.06 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 90 ల‌క్ష‌లు
తూర్పు: 57 ల‌క్ష‌లు
పశ్చిమ: 33 ల‌క్ష‌లు
గుంటూరు: 58 ల‌క్ష‌లు
కృష్ణ: 44 ల‌క్ష‌లు
నెల్లూరు: 26 ల‌క్ష‌లు
——————————————
ఏనీ+తెలంగాణ‌= 7.36 కోట్లు(13.50 కోట్లు~ గ్రాస్‌)
——————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.02 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.18 కోట్లు
——————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్‌ కలెక్షన్స్ = 9.56 కోట్లు(18.60 కోట్లు~ గ్రాస్)
——————————————-

కాగా, రూ. 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే క్లీన్ హిట్ గా నిలిచి రూ. 1.56 కోట్ల లాభాల‌తో ముందుకు సాగుతోంది. మొత్తానికి విశ్వ‌క్ ధ‌మ్కీ తో హిట్ కొట్టి త‌న స‌త్తా చాటాడు.