పండు మిర్చి లాంటి డ్రెస్సులో హాట్‌గా హాట్‌గా మెగా డాటర్.. దాసోహమంటోన్న ఫ్యాన్స్!!

మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తన అందం, నటన, చలాకీ తనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి రీసెంట్‌గా అనేక పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. నిహారిక విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయకపోవడంతో ఆమె అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఆమె తన జీవితం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను పంచుకునేది, కానీ హఠాత్తుగా డిసెంబర్ 2022 నుంచి పోస్ట్ చేయడం ఆపివేసింది.

ఇటీవల, నిహారిక పెయిడ్ పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా తన సోషల్ మీడియా సైలెన్స్ ను వీడింది. ఇప్పుడు పండుమిర్చి లాంటి హాఫ్ శారీలో తన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో కొరకొర చూపులతో ఈ ముద్దుగుమ్మ చాలా హాట్ గా కనిపించింది. తన వీపు అందాలను చూపించి గుండెల్లో వేడిని పెంచింది. ఇంతకుముందు కంటే ఇప్పుడే ఈ ముద్దుగుమ్మ మరింత ముద్దొచ్చేసింది. ఇక ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన అన్నయ్య రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించడం పట్ల ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. అయితే ఈ తార తన వైవాహిక జీవితంపై పుకార్లపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దాంతో ఫ్యాన్స్ లో ఆందోళన అలాగే ఉంది.

ఇకపోతే నిహారిక తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో కూడా బిజీగా ఉంది. ఆమె రెండు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తోంది రెండు ఇతర అసైన్‌మెంట్‌లపై పని చేస్తోంది. త్వరలో వెండితెరపైకి రావాలని కూడా ప్లాన్ చేస్తోంది.

Share post:

Latest