Game Changer First Look : “గేమ్ చేంజర్ కాదు..గేమ్ ఓవర్”..శంకర్ చేతుల్లో బలైపోయావు కదరా చరణా..!?

ఎస్ ప్రెసెంట్ అందరూ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ఇండస్ట్రీలోకి చిరుత అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు . మొదటి సినిమాతోనే మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న చరణ్ రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది . ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ పేరు మారు మ్రోగిపోయింది . ఈ క్రమంలోనే ఆయన ఏకంగా గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ చేశారు పలువురు సెలబ్రిటీస్ .

కాగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తరువాతి సినిమా ఆర్సి 15 నుంచి ఒక్కొక్క అప్డేట్ ను రిలీజ్ చేస్తూ అభిమానులకి కొత్త బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మేకర్స్. అయితే ఉదయాన్నే రిలీజ్ చేసిన టైటిల్ , లోగో అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది . ఇప్పటివరకు లీకైన పిక్స్ ఆధారంగా టైటిల్ కి పిక్స్ కి ఎటువంటి సంబంధం లేదు అంటూ మెగా ఫాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు . కాగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన చరణ్ ఫస్ట్ లుక్ అభిమానుల్ని మరింతగా హార్ట్ చేస్తుంది . టైటిల్ కి చరణ్ లుక్స్ కి అస్సలు పొంతనే లేదు అంటూ మెగా అభిమానులు ఫైర్ అయిపోతున్నారు

అంతేకాదు ఈ లుక్స్ లో చరణ్ చాలా హార్డ్ గా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారో అభిమానులు ఆ మాత్రం శంకర్ కి తెలియదా..? ఇలాంటి లుక్స్ లో రాంచరణ్ చూపిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు . ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ బర్త్ డే ను నాశనం చేసేసాడు అంటూ కొందరు జనాలు శంకర్ పై మండిపడుతున్నారు .

అంతేకాదు గ్లోబల్ స్టార్ లాంటి హీరోను ఈ విధంగా చూపించడం ఏమాత్రం అభిమానులకి నచ్చడం లేదు అంటూ వాళ్ళ కామెంట్స్ ఆధారంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న గేమ్ చేంజెర్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని మెగా ఫాన్స్ ఇప్పటినుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లుక్స్ లో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ హెయిర్ స్టైల్ అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేయడం మెగా ఫాన్స్ కు కూసింతపాజిటివ్ వైబ్స్ తెస్తున్నాయి. దీనితో పలువురు నటిజన్స్ శంకర్ గేమ్ చేంజర్ పోస్టర్ని ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోని చరణ్ ని నిలువునా ముంచేసావు కదా అంటూ శంకర్ పై ఫైర్ అవుతున్నారు కొందరు డై హార్ట్ మెగా ఫాన్స్..!!