బంపర్ ఆఫర్ కొట్టేసిన స్టార్ డాటర్.. మరో తెలుగు సినిమాకి సైన్ చేసిన జాన్వీ..!!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ గురించి పరిచయాలు అక్కర్లేదు. తన పేరుకు పరిచయాలు చేయవలసిన అవసరం లేకుండా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ హాట్ బ్యూటీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ కే పరిచయమైన తన అందాలను తెలుగులో కూడా పరిచయం చేయడానికి సర్వం రంగం సిద్ధం చేసుకుంది .

రీసెంట్ గానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది జాన్వి . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. పుట్టినరోజు సందర్భంగా అమ్మడు క్యూట్ క్యూట్ లుక్స్ ను జనాలకు పరిచయం చేశాడు డైరెక్టర్ కొరటాల శివ . కాగా ఇలాంటి క్రమంలోనే మరో తెలుగు సినిమాకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వి అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసింది బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు .ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పై కి వెళ్లనుంది . కాగా ఈ సినిమాలో కూడా హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లోనే వస్తుంది అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఉండే బడా హీరోలతో సినిమాను ఫిక్స్ అవ్వడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు..!!

Share post:

Latest