“ఏంటి..ఆ డైరెక్టర్ కు మెంటలా..మైండ్ దొబ్బిందా..?”..సంగీత సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. అందం.. టాలెంట్.. నటన ఎంత ఉన్నా సరే.. కొన్ని కొన్ని సార్లు వినరాని మాటలు వినాలి.. ఎదుర్కోలేని ఎదుర్కోవాల్సి వచ్చిన అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా అలాంటిగా అవమానాలు ఎదుర్కొని ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది హీరోయిన్ సంగీత .

మనకు తెలిసిందే ప్రజెంట్ సీనియర్ నటిగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న సంగీత ఒకప్పుడు హీరోయిన్గా కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది . మరీ ముఖ్యంగా అమ్మడు చేసిన ఖడ్గం సినిమా అప్పట్లో ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఖడ్గంలో సోనాలి బింద్రే లాంటి బాలీవుడ్ బ్యూటీ ఉన్న సరే సంగీతానే హైలెట్ అయింది . దానికి మెయిన్ కారణం ఆమె మేకప్ అని చెప్పాలి .

ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది సంగీత . ఆ తర్వాత పలు సినిమాలతో తన లైఫ్ని ముందుకు తీసుకువచ్చిన సంగీత.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోనే ..”ఖడ్గం సినిమాలో ఆ షార్ట్ చేస్తున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఉన్న వాళ్ళు చూసి నవ్వారని..

ఏంటి డైరెక్టర్ కృష్ణవంశీకి మైండ్ దొబ్బిందా..? ఇలాంటి అమ్మాయిని హీరోగా పెట్టుకున్నారు. ఆ అవతారం ఏంటి అంటూ ఎగతాళి చేశారని.. సినిమా హిట్ అయిన తర్వాత అదే గేటు బయట నన్ను చూసి సినిమా సూపర్ మేడం” అంటూ పొగిడేసారని చెప్పుకొచ్చింది . ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం ఆ సినిమానే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది సంగీత. ప్రజెంట్ సీనియర్ రోల్స్ లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది హీరోయిన్ సంగీత..!!

Share post:

Latest