రవితేజకి మహర్దశ పట్టేసింది.. ఇక పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలే!!

టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్, ఫరియ అబ్దుల్లా, దాక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, మేగా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ ‘రావణాసుర’ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మాజీ హీరో ప్రస్తుతానికి సైడ్ రోల్స్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే హీరోగా అవకాశాలు రావట్లేదు.

రావణాసుర షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయింది. అయితే ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది కూడా. ఇక షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ సినిమాని ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరవుతుండటంతో ఆ మూవీ టీమ్ సినిమాకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేసింది. ఆ టీజర్‌లో రవితేజ, సుశాంత్ అద్భుతంగా నటించి ప్రేక్షకులకు మెప్పించారు.

రావణాసుర టీజర్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అయితే ఈ టీజర్ యూట్యూబ్‌లో ఇప్పటివరకు 12 మిలియన్ వ్యూస్, 169K లైక్స్ ని సంపాదించుకుంది. దీని బట్టి చూస్తే రావణాసుర సినిమాతో రవితేజ కెరీర్ ఇంకో రేంజ్ కి వెళ్లిపోయేలా ఉంది. మరి టీజర్ ని చూసి ప్రేక్షకులు సినిమా పై పెట్టుకున్న ఆశలను నిజామవుతాయో లేదో అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది.

Share post:

Latest