సర్జరీ చేయించుకొని వికటించడంతో ఆ పని చేశానంటున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. తన అందచందాలతో గ్లామర్ తో గ్లోబల్ స్టార్ గా కూడా పేరుపొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక పలు హాలీవుడ్ మూవీలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా హీరోయిన్లకు సైతం డ్రెస్సింగ్ స్టైల్ ముఖం అందం చాలా అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. వీరు ఇలా అందంగా కనిపించడం కోసం సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఒకసారి ప్రియాంక చోప్రా సర్జరీ చేయించుకుందట. వాటి గురించి పలు విషయాలను తన ఆత్మ కథ అనే డైరీలో రాసుకుంది వాటి గురించి తెలుసుకుందాం.

ప్రియాంక చోప్రా ముక్కుకి సర్జరీ చేయించుకున్నప్పుడు ఫెయిల్ అయ్యి తన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందట. దీంతో ఆమె చాలా భయపడిపోయారని ఈ సమయంలో చాలా నిస్సహాయురాలుగా ఉండిపోయానని తెలుపుతోంది. తన మొక్కుకు సర్జరీ చేసే సమయంలో డాక్టర్ ఆసక్తిని కోల్పోయారని దీంతో తన మొక్కు ఆకారమే మారిపోయిందని బ్యాండేజ్ తొలగించగానే తన మొక్కు చూసిన తన తల్లి తాను భయపడిపోయామని రాసుకుంది.

ముఖ్యంగా ముక్కు వంకర పోవడం వల్ల తన ముఖమే మరొక లాగా కనిపించేదని అసలు నేను నాలాగే లేనని అద్దంలో చూసి వేరే ఎవరో చూసినట్టుగా ఉందని ఆ సమయంలో చాలా నిరుత్సాహంగా ఉండిపోయానని.. తన ఆత్మగౌరవం తగ్గిపోయినట్టు అనిపించిందని రాసుకుంది ప్రియాంక చోప్రా. ఇక తర్వాత మళ్లీ మామూలు మనిషిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని రాసుకొచ్చింది. గతంలో కూడా ప్రియాంక చోప్రా సర్జరీలు చేయించుకోందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈమె కాకుండా ఇలా ఎంతోమంది హీరోయిన్స్ సైతం సర్జరీలు చేయించుకొని వికటించిన వారు చాలామంది ఉన్నారు.