ఆ స్థానాల్లో గెలుపు మరిచిపోతున్న టీడీపీ!

గతంలో తెలుగుదేశం పార్టీ మంచి విజయాలు సాధించిన నియోజకవర్గాల్లో ఇప్పుడు విజయం సాధించాలంటే గగనం అయిపోతుంది. అసలు టి‌డి‌పి గెలుపుకు దూరమైపోతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి ఒకప్పుడు మంచి విజయాలే అందుకుంది. కానీ ఇప్పుడు గెలవడం కష్టమైపోతుంది. జిల్లాలో గుడివాడ, పామర్రు, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది.

గత ఎన్నికల్లో 16 స్థానాల్లో 14 స్థానాల్లో ఓడింది..అయినా గాని మళ్ళీ కొన్ని స్థానాల్లో టి‌డి‌పి పుంజుకుంటుంది. కానీ ఆ నాలుగు స్థానాల్లో మాత్రం టి‌డి‌పి పుంజుకోలేకపోతుంది. ఆ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే టి‌డి‌పికి పట్టు దొరకడం లేదు. అసలు గుడివాడ అంటే టి‌డి‌పి కంచుకోట..ఎన్టీఆర్ సైతం పలుమార్లు గెలిచారు. అలాంటిది ఇక్కడ గత రెండు సార్లు నుంచి టి‌డి‌పి ఓడిపోతుంది. ఈ సారి ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి.

అటు తిరువూరు విషయానికొస్తే 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది..మళ్ళీ అక్కడ గెలవలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు కూడా పెద్దగా లేవని సర్వే చెబుతుంది. ఇటు పామర్రు విషయానికొస్తే ఎన్టీఆర్ పుట్టిన గడ్డ..గత మూడు ఎన్నికల నుంచి ఇక్కడ గెలుపు లేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయింది…ఈ సారి కూడా గెలుపు అవకాశం లేదని తెలుస్తోంది.

అటు నూజివీడు విషయానికొస్తే..గత రెండు ఎన్నికల నుంచి టి‌డి‌పి గెలవడం లేదు..వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచేది కష్టమే అని తెలుస్తోంది. అంటే ఈ స్థానాల్లో టి‌డి‌పి గెలుపు మరిచిపోయే పరిస్తితి కనిపిస్తుంది.