నానిని ఆ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడు.. చివరికి అలా పగ తీర్చేసుకున్నాడు!

నేచరల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఈరోజు ఇండస్ట్రీలో గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నవారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నాని కూడా అంటున్నారు. ఇటీవలే నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. దీని రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న సందర్భంగా ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నాని వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్లలో తాను పడ్డ అవమానాల గురించి చెప్పుకొచ్చారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు కదా? మొదట్లో ఏమైనా కష్టంగా అనిపించిందా? అని ఒక జర్నలిస్ట్ నానిని ప్రశ్నించారు. నాని మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టంగా అనిపించింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అందులోనూ క్లాప్ అసిస్టెంట్‌గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుంది. ఒక దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించారు” అని నాని తెలిపారు.

అంతేకాకుండా క్లాప్ బోర్డ్ ఆలస్యమైన ఏదో ఒకటి అనేవారు అని చెప్పారు. అయితే మాటలు పడినందుకు ఆయన ఎప్పుడూ బాధపడలేదట. కానీ ఒక దర్శకుడు మాత్రం సెట్లో అందరి ముందు తనను అవమానించాడని, ఎప్పటికీ దర్శకుడు కాలేవురా అని అన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆ మాట తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని నాని అన్నారు. అలాంటి ఎన్నో విమర్శలు, అవమానాలకు సమాధానం నా ఎదుగుదల అని నేచరల్ స్టార్ నాని తెలిపారు.