బాలీవుడ్ పై బాంబ్ పేల్చిన కాజ‌ల్.. వామ్మో అంత మాట‌నేసిందేంటి?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే కెరీర్ పై ఫోకస్ పెట్టిన కాజల్.. మళ్లీ చేతి నిండా సినిమాలతో సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ బాలీవుడ్ పై బాంబ్ పేల్చింది. సౌత్ లో ఉన్న విలువలు బాలీవుడ్ లో లేవంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన కాజల్.. సౌత్ సినిమాలు వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడింది.

తాను ముంబై అమ్మాయిన‌ని, పుట్టింది పెరిగిందంతా ఇక్కడే అని.. అయితే త‌న కెరీర్ మాత్రం హైదరాబాదులో మొద‌లైంద‌ని తెలిపింది. తమిళ్ తెలుగు సినిమాల్లో తాను ఎక్కువగా పని చేశాన‌ని.. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్ చెన్నై నగరాలే త‌న‌ నివాసంగా భావిస్తాన‌ని తేల్చి చెప్పింది. అలాగే సౌత్ సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తార‌ని.. అద్భుతమైన దర్శకులు టెక్నీషియన్లు అక్కడ ఉన్నార‌ని కొనియాడింది.

ఇక బాలీవుడ్ లోనూ తాను కొన్ని సినిమాలు చేశాను కానీ.. సౌత్ పరిశ్రమలో ఉన్న నైతిక‌త‌, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్ లో లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు కాజల్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. బీటౌన్ సినీ ప్రియులు కాజల్ వ్యాఖ్యలు తప్పు బ‌డుతూ ఆమెను విమర్శిస్తున్నారు. మరి కొందరు త‌న మ‌న‌సులో ఉన్న మాట చెప్పింది.. అందులో త‌ప్పేంటి అంటూ కాజ‌ల్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు.

 

Share post:

Latest