ఆ ఒక్క మాట తో నితిన్ పరువు తీసేసిన అభిమాని.. మొహమాటం లేకుండా ఓపెన్ గా అడిగేసాడుగా..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా హిట్ కోసం ఆయన నానా తంటాలు పడుతున్నప్పటికీ ..కెరియర్ స్టార్టింగ్ లో నితిన్ ఎలాంటి హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందజేశాడు మనందరికీ బాగా తెలిసిన విషయమే. కాగా గురువారం మార్చి 30 నితిన్ పుట్టినరోజు. అయితే జనరల్ గా స్టార్ సెలబ్రిటీ పుట్టిన రోజులకు ఏదైనా తమ సినిమా నుంచి కీలక అప్డేట్ గాని.. ఫస్ట్ లుక్ గాని.. టీజర్ గాని రిలీజ్ చేస్తూ ఉంటారు .

అయితే హీరో నితిన్ ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండానే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే నితిన్ ఫాన్స్ ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యారు. కనీసం వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమా నుంచి టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ ఇచ్చుంటే బాగుండు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలో నే ఆయన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే నితిన్ బర్త్ డే సందర్భంగా ..ఆయనంటే ఎంతో ఇష్టపడే డైరెక్టర్ వక్కంతం వంశీ.. నితిన్ ఇంటికి వెళ్లి మరి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన పిక్ అఫీషియల్ గా షేర్ చేస్తూ ..”కొన్ని బంధాలు మాటలకి అందనవి ..అలాంటి బంధమే మాది ..హ్యాపీ బర్త డే నితిన్” అంటూ ట్వీట్ చేసి ట్యాగ్ చేశాడు. ఈ క్రమంలోనే నితిన్ కూడా రిప్లై ఇస్తూ ..”థాంక్యూ సో మచ్ డార్లింగ్ ..మన కంటెంట్ డిలే అయినప్పటికీ ఇంపాక్ట్ డబల్ ఉంటుంది ..సారీ గాయ్స్ కాస్త ఓపిక పట్టండి ..ఈసారి డిసప్పాయింట్ చేయను “అంటూ పొస్ట్ చేశారు .

అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్న నితిన్ అభిమాని ఒకరు రిప్లై ఇస్తూ..” మేము ఆల్రెడీ డిసప్పాయింట్ అయ్యాం లే అన్న ..బర్త్ డే బాగా గుర్తుండేలా చేసావ్ “అంటూ చాలా దీనంగా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. అయితే నితిన్ తన అభిమానికి రిప్లై ఇస్తూ.. సినిమాలపై అంచనాలు పెంచేశాడు . “ఈసారి రాబోయే సినిమా మీ అందరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంటుంది”..అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నితిన్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

Share post:

Latest