టచ్ చేయకూడని మ్యాటర్ ని కెలుకుతున్న మహేశ్ – త్రివిక్రమ్.. ఇక ఈ బాబుకు దిక్కు ఎవ్వడో..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటే రొటీన్ కధలు, రొటీన్ లవ్ స్టోరీలు.. బోరింగ్ కంటెంట్ డైరెక్ట్ చేస్తుంటే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎలాంటి పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాలను అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నారు . అందుకే డైరెక్టర్లు కూడా జనాలకు ఇష్టమైన కథలను.. ఇంట్రెస్టింగ్ పాయింట్లు బేస్ చేసుకొని స్టోరీస్ ని అల్లుకుంటున్నారు. కాగా ప్రెసెంట్ సినీ పాలిటిక్స్ లో ఏ ఇష్యూ హాట్ టాపిక్ గా ఉందో అందరికీ తెలిసిందే.

మూడు రాజధానుల వ్యవహారం ఇప్పటికీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తుంది. కాగా ఈ పాయింట్ అయితే జనాలకి బాగా రీచ్ అవుతుంది అనుకున్నాడో ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఏకంగా మహేష్ బాబుతో తీయ్యబోయే సినిమాలో ఈ ఇష్యూ ని టచ్ చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది .

కాగా ఫస్ట్ హాఫ్ లో చాలా యంగ్ లవర్ బాయ్ గా కనిపించే మహేష్ బాబు .. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి తన ఊరికి సంబంధించిన ఓ సమస్యను తీర్చడానికి ఊరి పెద్దమనిషిగా మారిపోతాడు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఏకంగా ఏపీలో హీట్ పెంచుతున్న మూడు రాజధానుల వ్యవహారాన్ని టచ్ చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇది నిజం అయితే మాత్రం మహేష్ బాబు ఇప్పటివరకు తెచ్చుకున్న మంచి పేరు మొత్తం గంగలో కలిసిపోయినట్లే. మనకు తెలిసిందే మహేష్ బాబు ప్రధానంగా ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయకపోయినా ..పర్సనల్గా ఓ రాజకీయ పార్టీతో మింగిల్ అయ్యి ఉన్నాడు అంటూ ఓ న్యూస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నిజంగా మహేష్ బాబు ఆ కీ పాయింట్ ని టచ్ చేస్తే ఖచ్చితంగా ఆయన పేరు రాజకీయాలలో నెగిటివ్గా మలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఈ క్రమంలోని త్రివిక్రమ్ ఆలోచించి మహేష్ బాబును ఆ కంటెంట్ ని టచ్ చేయకుండా.. సేఫ్ జోన్ లో కథను ముందుకు తీసుకెళ్తే మహేష్ బాబు తో పాటు త్రివిక్రమ్ కూడా సేఫ్ జోన్ లో ఉంటాడని ..ఒకవేళ త్రివిక్రమ్ ఇన్నర్ ఫీలింగ్స్ ను బయట పెట్టడానికి తన స్టోరీలో ఈ విధంగా మలిస్తే మాత్రం మహేష్ బాబు కెరీర్ ఊహించిన దెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి దీనిపై మహేష్ బాబు త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?