నా కోరిక తీర‌లేదు.. అందుకే అలాంటి వాళ్ల‌ను చూస్తే అసూయ అంటున్న ఎన్టీఆర్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిందంటే చాలు ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. భార్య‌, పిల్ల‌ల‌తో వెకేష‌న్ కు వెళ్తుంటారు. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తిని ఎన్టీఆర్ 2011లో వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు త‌న‌యులు.

 

అయితే ఎన్టీఆర్ కు ఆడ‌పిల్ల‌లంటే చాలా ఇష్ట‌మట‌. ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుంటుందని.. రెండోసారి అయినా తనకు అమ్మాయి పుట్టాల‌ని కోరుకున్నార‌ట‌. కానీ, ఆయ‌న కోరిక తీర‌లేదు. రెండో సారి కూడా ఆయ‌న‌కు అబ్బాయే జ‌న్మించారు. అందుకే `ఆడపిల్లలు ఉన్న వాళ్లను చూస్తే నాకు ఆసూయ. అమ్మాయి పుట్టాలని ఎంతగానో కోరుకున్నా జరగలేదు.

రెండోసారి అబ్బాయే అయ్యేసరికి నిరాశకు గురయ్యా. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు` అని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ఇటీవ‌లె ఈ చిత్రం ఘ‌నంగా ప్రారంభం అయింది.