వావ్: IPL 2023 లో నట సింహం.. కొత్త అవతారమెత్తిన బాలయ్య..ఇక కెవ్వు కేక..అంతే!!

ఎస్ ..ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పెట్టించే న్యూస్ అని చెప్పాలి . ఇప్పటివరకు బాలయ్యని డైరెక్టర్గా.. ప్రొడ్యూసర్ గా ..నటుడిగా.. హీరోగా ..విలన్ గా అఘోరా గా.. ఎన్నో పాత్రల్లో చూసాము శభాష్ అని మెచ్చుకున్నాము . కాగా రీసెంట్ గానే అస్ స్టాపబుల్ షో ద్వారా ఆయనలోని హోస్ట్ కూడా బయటపడ్డాడు . త్వరలోనే బాలయ్య లోని కొత్త టాలెంట్ ను జనాలకు చూపించడానికి శ్రీకారం చుట్టాడు నందమూరి బాలకృష్ణ .

ఎస్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్న ఐపీఎల్ 2023 సీజన్ 16 కోసం బాలయ్య కమెంటరర్ గా సెలెక్ట్ అయ్యాడు . అన్ స్టాపబుల్ షో కారణంగా నందమూరి బాలయ్య కి జనాల్లో డబుల్ కాదు ట్రిపుల్ క్రేజ్ వచ్చేసింది. ఎలాంటి సిచువేషన్ అయినా సరే హ్యండిల్ చేసి జనాలను మెప్పించే బాలయ్య ఐపిఎల్ 2023 సీజన్ 16 స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఫిక్స్ అయింది . ఈ క్రమంలోనే బాలయ్యను కమెంటరీగా సెలెక్ట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ క్రమంలోనే బాలయ్య కూడా మాట్లాడుతూ ..”చిన్నతనం నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం అని.. కాలేజీ రోజుల్లో క్లాస్ రూమ్ లోకి వెళ్ళకుండా ..మరి క్రికెట్ ఆడుతూ కూర్చునే వాడినని చెప్పుకొచ్చాడు. మళ్ళీ క్రికెట్ కి దగ్గర అవడం చాలా ఆనందంగా ఉంది ” అంటూ కామెంట్ చేశారు . ఈ క్రమంలో 2023 కమెంటరీ లో నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్ లో రఫ్పాడించేస్తాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ఆరంభ మ్యాచ్ కి కమెంటర్ గా వచ్చే బాలయ్యను ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ కి రప్పించాలని ప్రయత్నిస్తుంది స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . ఒకవేళ నిజంగా ఇదే జరిగితే మాత్రం ఐపీఎల్ సీజన్ 16 టిఆర్పి రేటింగ్స్ బద్దలు అవ్వాల్సిందే అంటూ నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు .అంతే కాదు దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో మీమ్‌స్ వైరల్ అయిపోతున్నాయి . ఒకవేళ బ్యాటర్లు బాగా ఆడకపోతే బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా మీమ్‌స్ చేసేస్తూ నవ్విస్తున్నారు..!!