చరణ్ అంటే రాజమౌళి కి అంత ఇష్టమా..? బర్త డే కి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా..?

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాకి గాను ఆస్కార్ అవార్డు కూడా వరించింది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ చేయించుకుని తన పేరుని మారుమ్రోగిపోయే విధంగా ట్రెండ్ చేసుకుంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇచ్చిన గ్రాండ్ పార్టీ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే చిన్న హీరో దగ్గర నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన రాజమౌళి వరకు ప్రతి ఒక్కరు ఈ పార్టీకి అటెండ్ అయ్యి రామ్ చరణ్ ని స్పెషల్గా విష్ చేశారు . అంతే కాదు రాంచరణ్ కెరియర్ ని మలుపు తిప్పిన రాజమౌళి రామ్ చరణ్ కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

కాగా రాజమౌళి కి మొదటి నుంచి చరణ్ అంటే మరింత ఇష్టమంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇదే క్రమంలో రాజమౌళి .. చరణ్ కి గుర్తుండిపోయే విధంగా ఓ రోజ్ వుడ్ తో చేసిన లారీను గిఫ్ట్ గా ఇచ్చారు . అంతేకాదు రోజ్ వుడ్ తో చేసిన మరొక ప్రతిమను కూడా కానుకగా అందించారు . దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . దీంతో రాజమౌళి కి చరణ్ అంటే ఇంత ఇష్టమా..? త్వరలోనే వీళ్ళ కాంబోలో మరో సినిమా వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!