టాలీవుడ్ లో మరో కొత్త జంట..? మన యంగ్ తెలుగు హీరో ప్రేమలో పడ్డాడ్రోయ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగెస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ..ప్రేమలో పడ్డాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . రీసెంట్గా ఆయన ఫేస్ లో కనిపించిన గ్లో చూస్తే ..అది నిజమే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్. కాగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం .. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ.. కమిట్ అయిన సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులకు ..కొత్త బూస్టప్ ఇస్తున్నారు . కాగా రీసెంట్ గా కిరణ్ అబ్బవరం ప్రేమలో పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . యస్..ఆయన బీహేవ్ చేసే పద్ధతి చూస్తున్న కూడా అదే నిజం అనిపిస్తుంది.

కిరణ్ అబ్బవరం రీసెంట్ గా కాశ్మిర్ వెళ్ళాడు. అక్కడి దిగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు . ఈ క్రమంలోనే సేమ్ లొకేషన్ లో హీరోయిన రహస్య కూడా కొన్ని పిక్స్ పోస్ట్ చేయడంతో..వీళ్ళ మధ్య ఏదో నడుస్తుందన్న డేటింగ్ రూమర్స్ కు బలం చేకూరినట్లు అయింది . వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆ కారణంగానే కాశ్మీర్ ట్రిప్ కు వెళ్లినట్టు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి . చూడాలి మరి దీనిపై కిరణ్ అబ్బవరం ఏ విధంగా స్పందిస్తాడో..?

 

 

View this post on Instagram

 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

 

Share post:

Latest