నేషనల్ క్రష్ ను నిలువునా ముంచేసిన స్టార్ డైరెక్టర్..రష్మిక కు ఊహించని భారీ షాక్..!?

అయ్యయ్యో ..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలిందా ..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . అమ్మడు ఏం చేసినా సరే ఓ పని లేని బ్యాచ్ అమ్మడిని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు .

రీసెంట్గా బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే రష్మిక మందన తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పుష్ప2 పైన పెట్టుకొని ఉంది . అయితే ఈ సినిమాలో అమ్మడు ఫుల్ లెంత్ హీరోయిన్ కాదు అని సగంలో రష్మిక క్యారెక్టర్ చచ్చిపోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం ఈ సినిమా హిట్ అయిన తన ఖాతాలో పడదు అంటున్నారు జనాలు.

రీసెంట్ గా రష్మిక కి మరో భారీ షాక్ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్.ఎస్.ఎం.బి 28 సినిమాలో మహేష్ బాబు పక్కన ఐటెం సాంగ్ లో నటించడానికి రష్మిక వేరే సినిమాకి కమిట్ అయి ఉన్న కాల్ షీట్లను క్యాన్సిల్ చేసి మరి ఈ సినిమాకి ఫైనల్స్ చేసిందట . అయితే లాస్ట్ మూమెంట్లో ఈ సినిమాలో ఐటమ్ గర్ల్ గా బాలీవుడ్ బ్యూటీ ని తీసుకోబోతున్నారని ..

రష్మిక ని ఈ సినిమా నుంచి తీసేసారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న పుష్ప సినిమా లో క్యారెక్టర్ సగం పోతే ..ఇక్కడ పూర్తిగానే లేపేశారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇది నిజంగా రష్మిక కు ఊహించని షాక్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు . చూడాలి మరి రష్మిక తన కెరీర్ ను ఏ విధంగా తీసుకోపోబోతుందో..?

Share post:

Latest