హీరో రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదే.. జీవిత..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా బాగా సుపరిచితులుగా మారిన జంట హీరో రాజశేఖర్, జీవిత. అయితే వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇంతకీ వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. రాజశేఖర్ ను జీవిత పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి..?
అనే విషయాలన్నింటినీ తాజాగా జీవిత బయటపెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. డాక్టర్ వృత్తిని వీడి సినిమాలపై ఆసక్తితో సీనియర్ హీరో రాజశేఖర్ నటుడిగా మారారు.

Jeevitha to direct Rajasekhar?

1984 లో మొదలైన తన సినీ ప్రస్థానం ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. ఎన్నో చిత్రాలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. నటి , దర్శకురాలు జీవితా ను పెళ్లి చేసుకున్నారు రాజశేఖర్. ఇక అప్పటినుంచి ఈ దంపతులు ఏ ఈవెంట్లోనైనా కలిసి హాజరవుతూ సందడి చేస్తూ ఉంటారు. అయితే రాజశేఖర్ జీవిత కు సంబంధించిన లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది..? ఇంతకీ రాజశేఖర్ జీవిత పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఏమిటి అనేది తాజాగా రివీల్ అయింది.

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో జీవిత స్వయంగా వారి ప్రేమ కథను వెల్లడించింది. 1987లో వచ్చిన తలంబ్రాలు సినిమాతో రాజశేఖర్ ,జీవిత కలిసి నటించారు. ఆ సినిమా ద్వారానే వీరిద్దరి ప్రేమకు బీజం పడింది. పద్మాలయ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడిపే వాళ్ళము.. అందుకే అలా దగ్గరయ్యాము.. ఆ సమయంలో రాజశేఖర్ ను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆయన చాలా ఓపెన్ గా ఉంటారు. ఆయనలో నచ్చేది నాకు అదే.. హ్యూమన్ బీయింగ్ కూడా బాగుంటుంది .. పైగా అందంగానూ.. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఆకట్టుకునేవారు. ఎలాంటి సీక్రెట్స్ ను దాచరు. ఆయన క్యారెక్టర్ , ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సరదాగా ఉంటారు. అయితే ఒకరోజు నేను ఇష్టపడుతున్న విషయాన్ని తెలుసుకొని.. మా ఇంట్లో అసలు ఒప్పుకోరని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఎదిరించి బయటకు రావడం వల్ల అయ్యే పని కాదని చెప్పారన్నారు. ఆ తర్వాత అన్ని సర్దుకున్నాయని తెలిపారు జీవిత. మొత్తానికైతే జీవితా నే రాజశేఖర్ కు మొదట ప్రపోజ్ చేసిందట.

Share post:

Latest