షాక్ ఇచ్చే విధంగా ఉన్న హౌస్ ఆఫ్ మంచూస్ టీజర్.. గొడవలపై క్లారిటీ..!!

మంచు కుటుంబంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.. ఈ గొడవ తెలుగు రాష్ట్రాలలోని చర్చనీయాంశముగా మారిందని చెప్పవచ్చు. అయితే అన్నదమ్ముల మధ్య చాలా కాలంగా ఘర్షణ కొనసాగుతోంది అంటూ ప్రజలలో వార్తలు వినిపించాయి. అన్న మంచు విష్ణు తన స్నేహితులపై చేయి చేసుకున్నాడని మనోజ్ ఆరోపించినట్లుగా ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో పేరు సంచలనానికి దారితీసింది.

New twist in manchu vishnu vs manchu manoj fight House of Manchus reality  show teaser released | మంచు విష్ణు-మనోజ్ గొడవలో ట్విస్ట్.. జనాన్ని  బకారాల్ని చేశారు మావా! News in Telugu

అయితే టీవీ చానల్స్ లో ముక్కలు ముక్కలుగా మంచు ఇంటి రభసలు వీక్షించి ప్రజలు అసలు ఈ ఇంట్లో ఓవరాల్ గా ఏం జరుగుతుందనే విషయాన్ని తెగ వెతుకుతూ ఉన్నారు.. మంచు ఇంట్లో అసలేం జరుగుతోంది మీడియాతో పాటు ప్రజలందరూ తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా అందుకు సంబంధించి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది.. ఆ వీడియోలో ఇప్పుడు బిజినెస్ మాన్ కం నిర్మాత మంచు విష్ణు ఎస్ క్యాష్ చేసుకునేందుకు ఒక రియాల్టీ షో ని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

“హౌస్ ఆఫ్ మంచు” అనే పేరుతో అతడు భారతదేశంలోని బిగ్గెస్ట్ రియాలిటీ షో ని చేసే ఆలోచనలతో ముందుకు రావడం జరిగింది.. దీనిపై ఒక ప్రోమో కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది.. మంచు బ్రదర్స్ ఘర్షణ గురించి ఒక వార్త రావడంతో చానల్స్ క్లిప్పింగుకు కాన్ సీక్వెన్స్ లతో ఇది ఆసక్తికరంగా మారింది.. టీజర్ లో విష్ణు తనని తాను పరిచయం చేసుకోవడం అనంతరం తన ఇంటికి ఏం జరిగిందో వివరించే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఇదంతా కేవలం వీరు ఈ ప్రోమో హైలెట్ కావడానికి చేశారని తెలుస్తోంది.. ఇది చూసిన కొంతమంది సినీ ప్రేక్షకులు అభిమానులు షాక్ అవుతున్నారు.