ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైన‌ల్ గా అలా ఓపెన్ అయిపోయిన వ‌రుణ్ తేజ్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌రుణ్ తేజ్‌.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది.

ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ల‌వ్ లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లెక్క‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావ‌ణ్య సంద‌డి చేయ‌డం, ప్రైవేట్ పార్టీల్లో జంట‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌డం నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి.

ఇంత జరుగుతున్నా అటు వరుణ్ కానీ, లావణ్య కానీ ఈ వార్తలపై ఒక్కసారి కూడా స్పందించలేదు. అయితే ఫైన‌ల్ గా వాలెంటైన్స్ డే వరుణ్ తన లవర్ ని పరిచయం చేశాడు. అయితే వరుణ్ ప్రేమిస్తుంది లావ‌ణ్య‌ను కాదండోయ్‌.. ఇంకా చెప్పాలంటే అమ్మాయినే కాదు.. జిమ్ ని. అవును, జిమ్‌ ఫోటో పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. సదరు కామెంట్ కి లవ్ ఎమోజీ జోడించాడు. నాకు అత్యంత ప్రియమైన, ప్రేమించే ప్రదేశం జిమ్ అని ప్రేమికుల రోజు వరుణ్ పరోక్షంగా తెలియజేశాడు.

https://www.instagram.com/p/CopUXdUJS7B/?utm_source=ig_web_copy_link