ఆ త‌ప్పు చేయ‌డం వ‌ల్లే ఉద‌య‌భాను కెరీర్ నాశ‌న‌మైందా…!

గతంలో టాలీవుడ్ బుల్లితెరపై యాంకరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా అభిమానులను కూడా దక్కించుకుంది. ఆ సమయంలో ఈమె సాహసం చేయరా డింబక, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, రేలారే రేలా వంటి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈమె తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో ఉదయభాను కు పోటీగా ఝాన్సీ, సుమ వంటి యాంకర్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Udaya Bhanu Phone Number, House Address, Email ID, Contact Details

తన కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే 2004లో విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని కెరీర్ లో ముందుకు సాగింది. ఆమె వివాహం చేసుకున్న సమయంలోనే ఆమెపై ఎన్నో వివాదాలు కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఉదయభాను సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది.. అంతేకాకుండా పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది. తన కెరీర్ మంచిగా ముందుకు వెళుతున్న సమయంలో ఉదయభాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమె కారు డ్రైవర్ గా ఉండేవారట.

Udaya Bhanu Twins, Anchor Udaya Bhanu Kids Twins Babies

అలా వీరిద్దరి మధ్య ఉన్న చనువు కాస్త ప్రేమగా మారడంతో వారి తల్లి తండ్రులను ఎదిరించీ మరి వివాహం చేసుకొన్నారు. మరి ముఖ్యంగా ఉదయభాను తల్లిదండ్రులు ఈ పెళ్లికి అసలు ఒప్పుకోలేదు.. కానీ ఆమె మాత్రం తను ప్రేమించిన వాడి కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదే విషయాన్ని ఉదయభాను సన్నిహితులు తెలిపారు. ఆమె ఎఫైర్, ప్రేమ, పెళ్లి వల్లే బుల్లితెరపై అంతగా రాణించలేకపోయింది. దాని ఫలితంగా ఆమెకు వచ్చే అవకాశాలు కూడా కోల్పోయిందని తెలుస్తుంది.

Anchor Udaya Bhanu Age, Family, Children, Biography, Net Worth & More

అంతేకాకుండా తన కెరీర్ పడిపోవడానికి ఆమె చేసిన తప్పులే కారణమని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి స్టార్ యాంకర్ గా ఉండాల్సిన ఉదయభాను ఇప్పుడు సాధారణ గృహిణిలా మారిపోయింది. ప్రస్తుతం ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను.. వారి అలనా.. పాల‌నా చూసుకుంటూ తన ఇంటికే పరిమితం అయింది.

Share post:

Latest