పాపం.. కూల్ గా ఉన్న ప్ర‌భాస్ జీవితాని..హాట్ గా చేసింది ఇతడే.. అందుకే ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించి సౌత్ ఇండియాలోనే క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు . అంతేకాదు ఒక్క సినిమాకి దాదాపు 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ మిగతా హీరోలకి కూడా దడ పుట్టిస్తున్నాడు. అయితే కెరియర్ పరంగా ఫ్లాపులు అందుకుంటున్న సరే చెరగని క్రేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ – అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తల దగ్గర నుండి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నాడు ప్రభాస్ అనే స్థాయికి ఆయనపై వార్తలు రాసేస్తున్నారు .

దానికి మెయిన్ రీజన్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకునే ఉమర్ సైంధు అంటూ మండిపడుతున్నారు జనాలు. ఎస్ అనుష్క – ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు కొట్టి పడేస్తూనే ఉన్నారు. అయితే కృతి తో పెళ్లి – ప్రేమ అని వచ్చిన వార్తలను జనాలు నమ్మలేదు. ఏదో ఆదిపురుష్ ట్రైలర్ లాంఛ్ లో చేయి పట్టుకున్నాడు అనంతమాత్రాన.. ఆ వార్తలను మనం నమ్మలేం.. ఎందుకంటే అనుష్కతో అంతకన్నానే క్లోజ్ గా మింగిల్ అయ్యాడు ప్రభాస్.

అయితే ఉమర్ సైంధు మాత్రం ఏకంగా కృతి – ప్రభాస్ ఎంగేజ్మెంట్ అంటూ ట్విట్ చేశాడు . అంతేనా అంతకుముందు “అఫీషియల్ : ప్రభాస్ – కృతి ప్రేమ మేటర్ లీక్ అయింది ..ఇప్పుడే నాకు బాలీవుడ్ స్టార్స్ నుండి సమాచారం అందింది ” అంటూ ట్వీట్ చేశాడు . ఇలా ప్రభాస్ – కృతి పేర్లు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోవడానికి కారణం ఉమర్ సైంధు..అంటూ పరోక్షకంగా కారణమయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్ చేయకుండా ఉంటే ఇంత తలనొప్పి వచ్చేది కాదు ..ఏదో అలా వినిపించి ఇలా పోయేది. ఈ ఉమర్ వల్ల రెబల్ హీరో చాలా కష్టాలు ట్రోలింగ్ కి గురవుతున్నాడు.. మా మధ్య ఏమి లేదురా బాబోయ్ అని చెప్తున్నా కానీ రెబల్ అభిమానులు వినట్లేదు. దీంతో కొందరు రెబల్ ఫ్యాన్స్ కూడా ఉమర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది..!!