అందాల నటి సౌందర్య ఆ కోరిక తీరకుండానే చనిపోయిందా..? ఇన్ని రోజులకు బయటపడ్డ అసలు నిజం..!!

దివంగత నటి సౌందర్య ఇలా చెప్తే జనాలకి నచ్చదు .. అందాల తార సౌందర్య అని చెప్తేనే జనాలు ఇష్టపడతారు .. అంతలా ఆమె అభిమానుల మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది . ఇప్పటికీ కొంతమంది సౌందర్యం మన మధ్య లేదు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు . సౌందర్య తన సినిమాల రూపంలో మన మధ్య ఉండే ఉందని చెప్పుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు తన తల్లి ఎంతలా రోదించిందో అంతకంటే డబల్ రేంజ్ లో సౌందర్యాన్ని ఆరాధించే అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . కాగ తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సౌందర్య.. తన ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే సౌందర్య తండ్రి సత్యనారాయణ ఓ జ్యోతిష్యుడు ..2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయనే ముందే జాతకం చూసి ఆమెకు చెప్పారట . అయితే జాతకాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేని సౌందర్య విషయాలను కొట్టి పడేసిందట .

“నేను అలాంటివి నమ్మను.. నాకు 50 ఏళ్లు వచ్చేవరకు కూడా నేను సినిమాలో ఉంటాను.. నా వయసుకు తగ్గ పాత్రలు చేస్తాను.. జనాలను నన్ను అభిమానిస్తారు.. ఇండస్ట్రీ నుంచి నేను ఎప్పుడు బయటకు రాను “అంటూ నాన్నకు తెగేసి చెప్పిందట . అయితే విధి ఆడిన వింత నాటకంలో సౌందర్య అర్ధాంతరంగానే కన్ను మూసింది . అలా తన 50 ఏళ్ల వరకు నటిస్తానన్న కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది సౌందర్య.. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు..!!