Sunil: “చచ్చినా ఆ సినిమా చేయకూడదు అనుకున్నా..కానీ చేసా” ..ఎందుకంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావుకి జాన్ జిగిడి దోస్త్. కమెడియన్ గా తన కెరీర్ను ప్రారంభించిన సునీల్ .. హీరో అవుదామని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు . అయితే ఆయన బాడీ లాంగ్వేజ్ హీరోగా కన్నా కమెడియన్ గానే సూట్ అవుతుంది అంటూ ఫిక్స్ అయ్యి ..కమెడియన్ గా సినిమాలో నటించారు. సునీల్ కమెడియన్ గా చేసిన ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాలి.


“నువ్వు నాకు నచ్చావ్”.. సినిమా మొదలుకుని ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి . ఎంతలా అంటే అప్పట్లో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలో కమెడియన్గా సునీల్ కావాలి అంటూ పట్టుబట్టి మరి అతగాడిని కమెడియన్ గా పెట్టించుకున్నారు . కాగా కొన్నాళ్ల తర్వాత సునీల్ కు హీరో గా చేసే ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన అందాల రాముడు అనే సినిమాతో మళ్లీ హీరోగా మారాడు.

అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సునీల్ .. అందాల రాముడు సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ చెప్పుకొచ్చారు . “ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను రిజెక్ట్ చేశాను.. నేను సినిమా చేయను అంటే చేయను అంటూ చెప్పుకొచ్చాను .. రెండేళ్ల పాటు అదే మాట చెప్పుకుంటూ వచ్చాను.. సినిమా చేయకూడదు అనుకున్నాను.. కానీ నేనే ఆ సినిమా చేయాలని డైరెక్టర్ లక్ష్మీనారాయణ పట్టు పట్టడంతో అతని ని బాధ పెట్టలేక చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మర్యాద రామన్న అంతా భగవంతుడు , రాజమౌళి దయ.. ఇక తర్వాత పూలరంగడు కోసం కూడా బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాను “అంటూ చెప్పుకొచ్చాడు ..!!