బిచ్చగాడు-2: ఏందయ్యా ఇది..హీరోనీ చూపించకుండానే ట్రైలర్..!!

భిన్నమైన చిత్రాలతో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. తెలుగులో బిచ్చగాడు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా సీక్వెల్ రావాలని అభిమానులు అందరూ కోరుకోవడంతో కోరుకున్నట్లుగానే ఈ చిత్రం సీక్వెల్న నిర్మిస్తూ ఉన్నారు హీరో విజయ్ ఆంటోని. దీంతో బిచ్చగాడు-2 సినిమాతో మరొకసారి ఆడియన్స్ లో సరికొత్త ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు తాజాగా అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

Vijay Antony's Bichagadu 2 Has A New Release Date! - Filmibeat
స్మిక్ పిక్ ట్రైలర్ అంటూ సినిమా ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేసి అంచనాలను పెంచేస్తోంది ఈ ప్రచారం చూస్తుంటే మనిషి మెదడుపై రీసెర్చ్ చేసే ఒక కథ రూపొందించనున్నట్లుగా తెలుస్తున్నది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా సన్నివేశాలు ఎంతో ఆసక్తిగా పెంచేలా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడం కాకుండా దర్శవత్వం కూడా వహిస్తున్నారట. సంగీతాన్ని కూడా ఆయన అందిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్గా కావ్య దాపర్ నటిస్తున్నది. కీలకమైన పాత్రలో మహేంద్ర కృష్ణమూర్తి, అలీ ఖాన్ వై జి ,రాధా రవి తదితరులు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా ట్రైలర్లో నటుడు విజయ్ ఆంటోని చూపించకపోవడంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నారని తెలుస్తోంది. దీంతో కొంతమంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్ ని కూడా ఒక బడా గ్రూపు దక్కించుకున్నట్లు తెలుస్తోంది తెలుగులో మాత్రం స్టార్ మా తమిళంలో విజయ్ టెలివిజన్లో బిచ్చగాడు-2 సినిమా ప్రీమియర్ కాబోతున్నది.