నందమూరి కుటుంబంలో మరొకరికి రోడ్డు ప్రమాదం..!!

ఈ మధ్యకాలంలో నందమూరి కుటుంబంలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. దీంతో అటు కుటుంబ సభ్యులు అభిమానులు కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారు. నిన్నటి రోజున తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.. అయితే కేవలం స్వల్పకాయాలతో బయటపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయినట్లుగా తెలుస్తోంది. నందమూరి రామకృష్ణ మాత్రం పూర్తిగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Nandamuri Ramakrishna: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే కొనసాగించాలి -  NTV Telugu

నందమూరి రామకృష్ణ ఇటీవలే బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో తారకరత్నను పరామర్శించడం జరిగింది.తారకరత్న ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.. తారకరత్న ఆరోగ్యం కుదుటపడుతోందని రామకృష్ణ చెప్పారు ఏమి పెట్టలేదని అనంత ఒక ఫేక్ ప్రచారమని కూడా తెలియజేశారు అవయవాలన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయని తెలియజేశారు. అయితే తాను కోలుకోవడానికి కొద్దిరోజులు సమయం పడుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం తన తండ్రి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పు సందర్భంగా కూడా రామకృష్ణ స్పందించారు.

ఇక NTR యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని కొనసాగించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. యూనివర్సిటీకి మూలకారకుడు వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలని వారి భావన అని తెలిపారు. ఇలా నందమూరి కుటుంబంలో ఎలాంటి విషయంలోనైనా స్పందిస్తూ ఉండేవారు రామకృష్ణ. కానీ ఇప్పుడు ఇలా ప్రమాదానికి గురి అవ్వడంతో అటు నందమూరి అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఆరోగ్యం కుదుటగా ఉందని తెలుసుకొని కాస్త ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది