పాప కు బాగా బలిసిందే..మహేశ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్.. ఇక దబిడిదిబిడే..!!

ఈ మధ్యకాలంలో బడా స్టార్స్ అందరూ వరుసగా పెళ్లి చేసుకుని అభిమానులకు ఊహించిన షాక్ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే అందాల ముద్దుగుమ్మలు బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లు చేసుకొని అభిమానులకి సరికొత్త సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కీయారా అద్వానీ . గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మెల్ హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్న ఈ బ్యూటీ ఎట్టకేలకు ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది..!!

 

కాగా ఫిబ్రవరి 4 ,5 తేదీల్లో మెహందీ , హల్దీ ఫంక్షన్లు.. ఆరవ తేదీ గ్రాండ్గా పెళ్లి నిర్వహించబోతున్నారు . నిజానికి పెళ్లి పనులను ఇద్దరు కలిసి మెలిసి చక చకా జరుపుకున్న ఈ జంట పెళ్లికి ఎవరెవరిని పిలవాలో కూడా పక్క ప్రణాళికతో ముందుకెళ్లారట . చాలా తక్కువ మంది బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్ళికి హాజరు కాబోతున్నారు. తన పెళ్లికి అతి తక్కువ మంది స్టార్స్ ఇన్వైట్ చేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించింది .

అయితే తెలుగులో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన మహేష్ బాబును మాత్రం అమ్మడు అసలు పిలవనేలేదు. హైదరాబాద్ కి వచ్చిన సరే మహేష్ బాబుని మీట్ అవ్వకుండా కనీసం ఆయనను ఇన్వైట్ చేయకుండానే వెళ్ళిపోయిందట. ఈ క్రమంలోనే మహేష్ బాబును ఇన్వైట్ చేయకపోవడానికి కారణమేంటంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే మహేష్ బాబు తో పెద్దగా క్లోజ్ గా మూవ్ అవ్వని ఆమె..

ఆయనతో ఫ్రెండ్షిప్ రాపోని పెంచుకోలేకపోయిందని ..మహేష్ కూడా హీరోయిన్ లతో వర్క్ చేసేటప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాడని ..ఈ కారణంగానే కీయారా అతన్ని పెళ్లికి ఇన్వైట్ చేయలేదని తెలుస్తుంది . అంతే కాదు సిద్ధార్ధ్ మల్హోత్రా కూడా రామ్ చరణ్ ని ప్రత్యేకంగా పెళ్లికి ఆహ్వానించినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో మహేష్ బాబుని అవమానించింది అంటూ కీయారా అద్వానీపై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఇక తెలుగులో నీకు అవకాశాలు ఎలా దక్కుతాయో మేము చూస్తాం అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు..!!

Share post:

Latest