అన్నని పెళ్ళి చేసుకున్న బాలీవుడ్ నటి..ఇదేం సాంప్రదాయం రా బాబు..!!

ఏంటో.. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో.. ఏమీ అర్థం కాకుండా పోతుంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్ సెలబ్రిటీస్ ప్రవర్తించే తీరు జనాలకు ఏమాత్రం అర్థం కావడం లేదు. ఓసారి ప్రేమ అంటారు ..ఇంతలోనే పెళ్లి అంటారు..అంతలోనే విడాకులు అంటారు ..అప్పుడే పుట్టిన ప్రేమ అప్పుడే ఎలా దాటిపోతుంది అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు . అయినా సరే అవేమీ పట్టించుకోకుండా నెలలోనే ప్రేమ.. రోజుల్లోనే పెళ్లి.. గంటల్లోనే విడాకులు అంటూ సరికొత్త ట్రెండ్ కి బానిస అయిపోతున్నారు స్టార్ సెలబ్రెటీస్ .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా నడిచిన స్వర్ణ భాస్కర్ ప్రేమ వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. తన ఫ్రెండ్ సమాజ్ వాది పార్టీ నేత అహ్మద్ ఫవాద్ను సీక్రెట్ గా జనవరి 6న పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి స్వర్ణ భాస్కర్.. రీసెంట్గా ఫిబ్రవరి 16న తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన పెళ్లి విషయాన్ని పంచుకుంది. దీనిపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుంటే ..మరి కొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు .

అన్నయ్య ..అని పిలిచే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని.. కొందరు మండిపడుతుంటే..మరి కొందరు బూతులు తిడుతున్నారు. 2020 లో ఎస్పీ తరఫున ప్రచారం నిర్వహించేందుకు స్వర్ణ భాస్కర్ ఆయనని అన్నయ్య అని పిలిచేదట . అంతేకాదు అతడు పుట్టినరోజు సంధర్భంగా “భాయ్” అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు. నీలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచం తలకిందులు అయిపోతుంది అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. దీంతో స్వర్ణ భాస్కర్ పేరు హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది..!!

Share post:

Latest