Jr NTR అందుకే అలా మాట్లాడాడా అక్కడ?

తెలుగు చిత్ర సినిమలో Jr NTR ఓ ప్రభంజనం. సాధారణంగా Jr NTR సినిమా ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు మంచి జోష్ తో నవ్వుతూ ఉంటాడు. ఈ క్రమంలో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సరదాసరదా సమాధానాలు చెబుతూ వుంటారు. ఇక స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తాత నందమూరి తారకరామారావు గురించి, అభిమానులు గురించి ఏకరువు పెడతాడు. అయితే Jr NTR తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దానికి భిన్నంగా వ్యవహరించడమే ఇపుడు అభిమానుల్లో గుబులు పుట్టేలా చేస్తోంది.

Jr NTR ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ… తన అభిమానులకు చిన్నగా క్లాస్ పీకినట్టు కనబడుతోంది. తన లేటెస్ట్ సినిమాల అప్ డేట్స్ గురించి టెన్షన్ పడొద్దనీ, ఆ విషయాలు ఏమైనా ఉంటే తన భార్య కంటే ముందుగా తన అభిమానులకే చెపుతానని వారికి సాఫ్ట్ గా క్లాస్ ఇచ్చినట్టు స్పష్టమౌతోంది. తన సొంత సినిమా లాంటి ‘అమిగోస్’ మూవీ ఫంక్షన్లో తారక్ ఎందుకు అంత మూడీగా కనిపించాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ ఫంక్షన్ జరిగిన రోజు తనకు ఆరోగ్యం బాగాలేదని, అయినప్పటికీ తన అన్న కళ్యాణ్ రామ్ కోసం తాను ఒళ్ళు నొప్పులుగా ఉన్నా తాను వచ్చాను అంటూ ఓపెన్ గా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.

అది చాలదన్నట్టు ఆరోజు యాంకర్ సుమ తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం జూనియర్ ను కాస్త ఇబ్బంది పెట్టింది. దాంతో సుమ భర్తతో తనకున్న సాన్నిహిత్యం రిత్యా Jr NTR కొన్ని చురకలు వేసిన విషయం తెలిసిందే. అయితే తారక్ ఇలా మూడీగా ఉండటానికి ఇంకో కారణం వుంది ఉండవచ్చు అని కొందరు కుహనా మేధావులు ఊహాగానాలు చేస్తున్నారు. ‘RRR’లో తాను నటించిన ‘కొమరం భీమ్’ పాత్రకు అనుకున్న స్థాయిలో పేరురాకపోవడం వలన Jr NTR అలా డీలాపడిపోయాడని అంటున్నారు. అయితే కొంతమంది దీనిని కొట్టి పారేస్తున్నారు.