ఆమాత్రం దానికి చీర కట్టుకోవడం దేనికి నందిత? అంటున్న నెటిజన్లు!

హాట్ హాట్ హీరోయిన్లకు నిలయం తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇక్కడ టాలెంట్ కొద్దిగా, అందాల ఆరబోత ఎక్కువగా కలిగిన హీరోయిన్లు చాలామంది వున్నారు. అందులో కూడా కొంతమంది అరుదుగా మంచి నటన కనబరిచేవారు కనబడుతూ వుంటారు. అలాంటివారిలో నందితా శ్వేత ఒకరు. అందుకేనేమో ఈమెకు అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. బేసిగ్గా కన్నడ అమ్మాయే అయినా దక్షిణాది మొత్తం ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ భారీ ఆఫర్లను సొంతం చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతోంది.

అయితే సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ చూస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే నందితా శ్వేత ‘నందా లవ్స్ నందిత’ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ ‘అట్టకత్తి’ అనే తమిళ చిత్రం చేసింది. ఇక అక్కడి నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు తమిళంలో పది సినిమాల వరకూ చేసి ఓ రేంజ్‌లో సత్తా చాటింది. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే నందితా శ్వేత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా ఆడినప్పటికీ ఆమెకు ఇక్కడ పెద్దగా ఆఫర్లు రాలేదు. దీంతో తమిళంలోనే సినిమాలు చేస్తూ పోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘శ్రీనివాస కల్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమకథా చిత్రం2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఆమెకు మాత్రం పెద్దగా బ్రేక్ రాలేదు. పైగా భారీ ఆఫర్లు కూడా ఆశించిన రీతిలో రాకపోవడం వలన మళ్ళీ తమిళం, కన్నడంలోనే సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన నందితా శ్వేత 2021లోనే తమిళం, తెలుగులో కలిపి దాదాపు పది సినిమాల్లో నటించింది. కాగా ఈ మధ్య కాలంలో నందితా శ్వేత సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది.