అయ్యయ్యో..ఉన్నది పాయే..ఉంచుకున్నది పోయే.. ఏం జాతకం రా బాబు..!!

పాపం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన టైం బాగోలేదా అంటే అవునని అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో అమ్మడు ఏ పని చేసిన ట్రోలింగ్కి గురవుతుంది. మాట్లాడిన ట్రోలింగ్.. మాట్లాడకపోయినా ట్రోలింగ్.. ఏది ముట్టుకున్న ట్రాన్స్ఫారం కంటే హై రేంజ్ లో బ్లాస్ట్ అయిపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకుందట. కానీ తాను ఏమి తప్పు చేయనప్పుడు ఎందుకు ట్రోలింగ్ కి భయపడాలి అంటూ మళ్ళీ తన ఆలోచన ను విరమించుకునిందట.

Geetha Govindam combination reunites with Dil Raju

ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన ఓపెన్ గా చెప్పుకొచ్చింది . కాగా ఈ మధ్యకాలంలో రష్మిక మందన చేసిన రెండు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి . అంత ఎందుకు పక్కాగా చెప్పాలంటే పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన హిట్ కొట్టిందే లేదు . వారసుడు సినిమా హిట్ అయిన క్రేజ్ మొత్తం విజయ ఎగరేసుకుపోయాడు.. బాలీవుడ్ లో ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన గుడ్ బై సినిమా గుడ్ బై చెప్పేసింది ..మిషన్ మజ్ను సినిమా అమ్మడికి పేరు తీసుకురాలేకపోయింది . ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి ..సినిమా ఇండస్ట్రీలో డిజాస్టర్లకి రష్మిక బాగా ఇబ్బంది పడిపోతుంది . ఈ క్రమంలోనే రష్మిక మందన చేతి నుండి మరో క్రేజీ ప్రాజెక్టు కూడా చేజారిపోయినట్లు తెలుస్తుంది.

Dil Raju calls Pooja Hegde 'lucky charm' of film industry - Telangana Today

గీత గోవిందం 2 సినిమాలో రష్మిక మందన నీ హీరోయిన్గా ఫిక్స్ చేసిన పరశురాం దిల్ రాజు కోసం రష్మిక మందన్నా కు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ – రష్మిక మందన ఫస్ట్ టైం జతకట్టిన సినిమా గీతగోవిందం ..ఈ సినిమా ఇండస్ట్రి లెక్కలను తిరగరాసింది. రీసెంట్గా ఈ సినిమాకి సీక్వల్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు లక్కీ హీరోయిన్ పూజ హెగ్డే ను ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారట దిల్ రాజు .

ఈ క్రమంలోని రష్మిక మందన పాత్రను తగ్గించారట . దీంతో కోపం వచ్చి రష్మిక మందన సినిమాలో తన పాత్ర లెంత్ పెంచాలంటూ డిమాండ్ చేసిందట . దీంతో తిక్క రేగిన దిల్ రాజు అమ్మడిని తీసేసి ఫస్ట్ హీరోయిన్గా పూజ హెగ్డే ని ఫిక్స్ చేశారట . దీంతో విజయ్ కూడా ఏమీ అనలేక సైలెంట్ అయిపోయాడట. ఈ రకంగా ఉన్న సినిమాలు డిజాస్టర్ గా మారి వచ్చిన ఆఫర్లు చేతులారా వదులుకొని రష్మిక మందన లబోదిబో అంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ రకంగా చూసుకుంటే పాపం రష్మిక జాతకం అస్సలు బాగోలేదు అంటూ ఫ్యాన్స్ కూడా చెప్పుతున్నారు..!!