సరే..అదే అనుకుంటాం..అయితే ఏంటంటా..? మీకేంటి నొప్పి..?

టాలీవుడ్ నందమూరి నటసిం హం బాలయ్య హోస్టుగా చేస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్ధ ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. కాగా ఎవరు ఊహించని విధంగా సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. సీజన్ 2 ని స్టార్ట్ చేశారు మేకర్స్. సీజన్ 2 కూడా హ్యూజ్ సక్సెస్ అయింది . కాగా సీజన్ వన్ లో కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని గెస్ట్లుగా పిలిచిన ఆహా.. సీజన్ 2 కి వచ్చేసరికి పొలిటికల్ పరంగా కూడా లాక్కొచ్చింది. ఈ క్రమంలోనే పలువురు పొలిటీషియన్స్ అన్ స్టాపబుల్ స్టేజిపై మెరిసారు.

రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చారు . దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.. సెకండ్ ఎపిసోడ్ మరికొద్ది గంటల్లోనే స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఇలాంటి క్రమంలోని కొందరు సో కాల్డ్ పేరులేని పొలిటీషియన్స్ తోకలము అంటూ చెప్పుకునే కొందరు జనాలు బాలయ్య – పవన్ కళ్యాణ్ పై హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసింది షో అన్నాక అన్ని ప్రశ్నలు అడగాలి ..కేవలం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి చెందినవారైతే అలాంటి ప్రశ్నలే అడిగేవాడు ..కానీ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ పొలిటికల్ రంగంలోనూ దూసుకుపోతున్నాడు.. ఈ క్రమంలోనే షో యాజమాన్యం చెప్పినట్టు బాలయ్య పొలిటికల్ పరంగా కూడా కొన్ని ప్రశ్నలు వేశారు .

Pawan Kalyan shoots with Nandamuri Balakrishna for Unstoppable With NBK.  Leaked pics, videos - India Today

ఆయనపై ఉన్న నిందలను చెరిపేయడానికి ట్రై చేశాడు ..ఈ విషయం నచ్చని కొందరు సో కాల్డ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ – బాలయ్యను జత చేసి దొందు దొందే అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేశారు . అయితే వీళ్లకు ఘాటైన జవాబు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ – నందమూరి ఫ్యాన్స్ . తప్పు చేసిన వాడే భయపడాలి.. తప్పు చేయనప్పుడు భయమే వద్దు ..అది బాలయ్యకు – పవన్ కళ్యాణ్ కు పుట్టుకతో వచ్చిన గుణం ..సో ఈ చిల్లర బ్యాచ్ ఎంత మొరిగిన పవన్ కళ్యాణ్ – బాలయ్య ఏ మాత్రం తగ్గరు.

Unstoppable NBK 2: Pawan Kalyan to appear on Balakrishna's show; Candids,  teaser to Sai Dharam Tej's entry | PINKVILLA

సరే మీరు అంటున్నట్లు బాలయ్య కావాలని పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ ను ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు అనుకుంటాం ..అయితే మీకేంటి నొప్పి..? పవన్ కళ్యాణ్ నిజంగా బ్యాడ్ పర్సన్ అయితే జనాలు ఆయనకు ఓట్లు వేయరు ..గుడ్ పర్సన్ అయితే జనాలు ఓట్లు వేసి గెలిపిస్తారు.. రాత్రికి రాత్రికి రాజకీయాలు ఏమి మారవు.. రాత్రికి రాత్రి సీఎం కుర్చీ చేజారిపోదు.. మరి అలాంటి దానికి ఇంత తతంగాలు ఎందుకు? షోని షోగా చూడండి ..అంతేకానీ పర్సనల్గా తీసుకొని టార్గెట్ చేసి ట్రోల్ చేయకండి అంటూ ఘాటుగా జవాబిస్తున్నారు.

Pawan Kalyan makes TV debut on Balakrishna's chat show, pics leaked online  - Hindustan Times

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ – బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 పార్ట్ 2 ఎపిసోడ్కి హ్యూజ్ బజ్ ఏర్పడింది . చూద్దాం ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ను బాలయ్య ఏ పొలిటికల్ గా ఎలాంటి ప్రశ్నలు అడిగారో.. పవన్ ఏ విధంగా సమాధానం చెప్పారో.. మరికొద్ది గంటల్లో తేలిపోతుంది ..!!