తెలియని తనమా లేక ఇంకేంటి.. మెగా హీరోల కూతుర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కథ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఇలాంటి చెత్త కథను సుష్మిత ఎలా ఎంచుకుంది??  కనీసం ఈ కథతో సినిమా నడవదని ఆమెకు తెలియదా అని సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య బలమైన సంఘర్షణ లేదు, హీరో, హీరోయిన్లు మధ్య ఆకట్టుకునే ప్రేమకథ కూడా లేదు. విలేజ్ ఫ్లేవర్ కూడా పూర్తిగా మిస్సయింది.

ఇక ఈ సినిమాలో చూడడానికి ఏముంది కొత్తగా అని,  తలబాదుకోక తప్పదని చూసినవారు కామెంట్స్ చేస్తున్నారు. సుష్మిత ఇలాంటి పాత కథను ఎంచుకుంది, ఇది మొదటిసారి కాదు. ఆమె మునుపటి ప్రొడక్షన్ వెంచర్‌లు సేనాపతి, షూట్‌అవుట్ ఎట్ అలైర్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా ఎంగేజింగ్ కథ అనేది లేనేలేదు. ఇక హలో వరల్డ్ వంటి ఇటీవలి వెబ్ సిరీస్‌లలో ఎటువంటి కొత్తదనం లేదు. ఈ సిరీస్ ను మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసింది. ఆమె మరో ప్రొడక్షన్ వెంచర్ ఓక చిన్న ఫ్యామిలీ స్టోరీ కొంచెం మెప్పించినప్పటికీ, నాన్న కూచి మళ్లీ ప్రేక్షకులకు తలనొప్పి తెప్పించింది. ఇలా మెగా కూతుళ్లు రొటీన్ కథలే ఎందుకు ఎత్తుకుంటున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తెలియని తనమా లేక ఇంకేంటి మెగా కూతుర్లు ఇలాంటి చెత్త ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా నిరాశను వ్యక్తపరుస్తున్నారు.

బాలీవుడ్‌లోని కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు తమ స్క్రిప్ట్‌ల ఎంపికతో ఓటీటీ రంగంలో అద్భుతమైన సిరీస్ లు చేస్తున్నప్పుడు, కొణిదెల సోదరీమణులు అదే పాత టీవీ సీరియల్ కథనాలను ఎందుకు ఎంచుకుంటున్నారని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వారు ఇప్పటికైనా కొన్ని ఆఫ్‌బీట్ కథలను ఎంచుకోవడం, రచనా భాగంలో ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే యాక్టింగ్ రంగంలో వారు తమదైన మార్క్ చూపించడం కష్టం.

Share post:

Latest