నటి హేమ సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది నటి హేమ. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇమే హవా బాగ నడిచిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఏ చిత్రంలో కూడా పెద్దగా కనిపించలేదు.కేవలం అప్పుడప్పుడు ఏదో ఒక వివాదంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది హేమ. హేమ తిరిగి సినిమాలలో నటించారని అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి ప్రశ్న తాజాగా హేమాకు ఎదురైందట .ఈ విషయంపై స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం

Actress Hema clarifies on pub raids, slams mediaనటి హేమ మాట్లాడుతూ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉండడం వల్లే తాను ఎక్కువగా సినిమాలకు సమయాన్ని కేటాయించడం లేదని తెలియజేసింది త్వరలోనే తను చేయబోతున్న బిజినెస్ సంబంధించి అన్ని వ్యవహారాలను కూడా అభిమానులతో పంచుకుంటానని తెలియజేసింది హేమ. ఈమె వయసు ప్రస్తుతం 56 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా హేమ త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలలోని నటిస్తూ కామెడీ పంచులతో బాగా ఆకట్టుకుంది. బ్రహ్మానందం, హేమ మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయని చెప్పవచ్చు.

హేమ ప్రస్తుత రెమ్యూనరేషన్ విషయానికి వస్తే రోజుకి ఈమె రూ.1.5 నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు అటు ఇటుగా తీసుకుంటున్నట్లు సమాచారం. చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు సక్సెస్లను అందుకుంటున్నారు. అయినా కూడా టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో హేమ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన కూడా సరైన పాత్రలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు హేమ రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.