అక్కినేని కోసం తనకు ఎంతో ఇష్టమైన దాన్నీ వదులుకున్న ఎన్టీఆర్..!

తెలుగు సినిమాకు రెండు కళ్ళు ఎవరు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అనే మాట వాస్తవం. ఎంతమంది నటులు వచ్చినా ఇద్దరికీ సరి రారు. ఎన్టీఆర్ కంటే అక్కినేని సినిమాల్లోకి ముందు వచ్చినా సరే ఇండస్ట్రీలో ఇద్దరూ ఒకే విధంగా తమ ప్రభావం చూపించారు. ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా వెనకడుగు వేసే వారు కాదు ఇద్దరు ఆ రోజుల్లో వీరిద్దరికి పోటీ కూడా ఉండేది కాదు.

వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. తమ ఇమేజ్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా మల్టీ స్టార్ సినిమాలు చేసేవారు. ఇద్ద‌రు కలిసి దాదాపు 14 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఇక వీరిద్దరూ కలిసి 1977లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో చాణక్య చంద్రగుప్త సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌కు మాత్రం ఎప్పటినుంచో చాణుక్య పాత్ర పోషించాలని ఒక కోరిక ఉండేది.

Chanakya Chandragupta - Alchetron, The Free Social Encyclopedia

దానికోసం కథ కూడా రెడీ చేసుకున్నాడు. ఇది మల్టీస్టారర్ సినిమా కావటంతో చివరికి అక్కినేని చాణక్య పాత్రలో నటించాడు. వాస్తవానికి ఈ సినిమాకు ముందు వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ సినిమా కోసం ఇద్ద‌రు కలవడంతో ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది.

Chanakya Chandragupta Movie | Cast, Release Date, Trailer, Posters,  Reviews, News, Photos & Videos | Moviekoop

అక్కినేని నాగేశ్వరరావు చాణుక్యుని పాత్ర అడగటంతో ఎన్టీఆర్ నో అనలేదు. ఇక అది కూడా ఎన్టీఆర్ సొంత సినిమా కావడంతో రామకృష్ణ స్టూడియోలో షూటింగ్ కూడా చేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో జెమినీ గణేషన్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ విధంగా ఎన్టీఆర్ తనకి ఇష్టమైన పాత్రను అక్కినేని కోసం వదులుకున్నాడు.