సీనియర్ హీరో వడ్డే నవీన్‌కు… జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న రిలేష‌న్ ఇదే… ఎందుకు బ్రేక్ అయ్యింది..!

మనకు ఇష్టమైన నటీనటుల గురించి తెలుసుకోవాలని ఉత్సాహం చాలామందికి ఉంటుంది. వాళ్లు వేసుకునే బట్టల దగ్గర నుంచి, కాళ్లకు వేసుకునే షూ వరకు ప్రతిదీ ఫాలో అయిపోతుంటారు వారి అభిమానులు అంతేకాకుండా వారి స్నేహితులు వారి చుట్టాలు గురించి కూడా తెలుసుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇక ఇప్పుడూ టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య రిలేషన్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పటికీ కూడా వారి మధ్య ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుటి స్టార్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా... | Tollywood Veteran Hero  Vadde Naveen News - Telugu Vadde Naveen

టాలీవుడ్‌కు కోరుకున్న ప్రియుడు సినిమాతో పరిచయమయ్యాడు వడ్డే నవీన్. టాలీవుడ్ సీనియర్ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తరంగేట్రం చేసిన ఈ హీరో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఆయనకు సక్సెస్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలతో వరుస హిట్‌లు అందుకుని ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే నవీన్ తన కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా టాలీవుడ్ నుంచి దూరమయ్యాడు.

దాదాపు 25 సినిమాల్లో హీరోగా నటించిన ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ తర్వాత అవి కూడా ప్లాఫ్ అవడంతో ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు.ప్రస్తుతం నవీన్ సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే వడ్డే నవీన్ నందమూరి కుటుంబానికి అల్లుడు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులలో ఒకరైన నందమూరి రామకృష్ణ కూతురును వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ పెళ్లిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి జరిపించారట.

Actor Vadde Naveen హీరో వడ్డే నవీన్ – జూనియర్ ఎన్టీఆర్ కి బావ అవుతారు అని  తెలుసా… | Telugu Online News

జూనియర్ ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ మంచి స్నేహితుడ‌ని అప్పట్లో ఓ టాక్ కూడా నడిచేది. పెళ్లికి ముందే వడ్డే నవీన్ రామకృష్ణ కూతురుతో ప్రేమలో పడ్డాడట. ఎన్టీఆర్ వల్ల ఈ పెళ్లి జరిగిందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వడ్డే నవీన్ విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా పెళ్లయిన కొద్ది రోజులకే నందమూరి కుటుంబంతో తన బంధుత్వం తెంచుకున్నాడు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం తన రిలేషన్ ఇప్పటికీ కొనసాగిస్తున్నాడట వడ్డే నవీన్. ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దీ మందికి మాత్రమే తెలుసు.