తొట్టెంపూడి వేణు భార్య ఇంత రిచ్చా… ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే…!

అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న ఒకప్పటి సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి. చాలా సినిమాలలో సోలో హీరోగా, పలు మల్టీస్టారర్ సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. స్వయంవరం అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వేణు. ఇక తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అయితే వేణు హీరోగా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు.

Happy birthday Venu Thottempudi: Did you know the reason behind his long absence from films? | Telugu Movie News - Times of India

అవన్నీ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా ఉంటూ ఎంటర్టైన్మెంట్ కి దగ్గరగా ఉంటూ.. ఆయన నటించిన స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా మనకి బోర్ కొట్టవు కడుపుబ్బ నవ్విస్తాయి. కానీ ఆ తర్వాత తన కెరీర్లో వరుస ప్లాఫ్ లు రావడంతో సినిమాలుకు దూరమయ్యాడు వేణు. సినిమాలుకు దూరమై 10 సంవత్సరాలు అవుతుంది.

ఇక తన సినిమాలు కి బ్రేక్ ఇచ్చిన వేణు 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో నటించాడు. అలానే గత సంవత్సరం రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో కనిపించడు వేణు. అయితే వేణు వ్యక్తిగత జీవితంలో భాగంగా ఆయన భార్య గురించి తెలుసుకుందాం.
వేణు తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అనుపమా చౌదరి.. ఈమె మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.

ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. వీరిద్దరూ పెళ్ళికి ముందే ఒకరికి ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అవుతుంది. ఇక వీరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. వేణు సినిమాలతో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా చేశారు. ఈ క్రమంలోనే వరుస బిజినెస్ పనులలో బిజీ అయిపోవడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇక వేణు, భార్య అన్ని విధాలుగా అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తు తన ఫ్యామిలీ ని కూడా ఎంతో హ్యాపీగా చూసుకుంటుంది.