RRR చిత్రానికి మరొక హాలీవుడ్ అవార్డు..!!

RRR చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పెను సంచలన విజయాలను అందుకుంది. ఇక అనేక అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డు వేదికల పైన కూడా..RRR జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు అవార్డులు బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకుంటోంది.

Huge hype surrounds the re-release of Rajamouli's RRR in the USA
ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ అవార్డులో మరొక అవార్డు కూడా అందుకుంది. అల్లూరి సీతారామరాజు వేషధారణలో రామ్ చరణ్ బాణాలు వేసి సన్నివేశాన్ని మరి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ స్టాంట్స్ హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ జ్యూరీకి కూడా నచ్చిందిఅందుకే ఈ అవార్డును ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. తమ సినిమాలలో స్టంట్ గుర్తించి అవార్డు ఇచ్చిన హెచ్ సి ఏ కు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ముందుగా తమ యాక్షన్ కొరియోగ్రాఫర్లకు థాంక్స్ చెబుతున్నాను అంటూ తెలియజేశారు.

HCA Awards: RRR wins 4 awards & makes Indians proud | 123telugu.com
స్టంట్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా ఎఫర్ట్ పెట్టాడని తెలియజేశారు.క్లైమాక్స్ యాక్షన్ సీక్వెలలో కొన్ని తీయడానికి రూబీ హెల్ప్ చేశారని రాజమౌళి తెలియజేయడం జరిగింది.ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లకు కూడా ఇండియా వచ్చి తమ విజన్ అర్థం చేసుకొని తమ వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకొని పని చేశారని తెలిపారు. ఇక నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి గేయ రచయిత చంద్రబోస్తులు సంయుక్తంగా అవార్డును అందుకున్నారు.