రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజ‌న్‌.. యాంక‌ర్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

వీధికుక్కల దాడిలో హైదరాబాద్‌లో నాలుగేళ్ల‌ బాలుడు తీవ్రంగా గాయపడి మరణించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో పెట్, యానిమల్ లవర్స్ పై నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. బుల్లితెర స్టార్ యాంక‌ర్ రష్మికి కుక్కలంటే చాలా ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

పైగా బాలుడి మ‌ర‌ణంపై స్పందిస్తూ కుక్క‌ల‌కే ర‌ష్మీ స‌పోర్ట్ చేయ‌డం కొంద‌రికి అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో ఏటా వీధి కుక్కల బారిన పడి ఎందరో ఆస్పత్రి పాలవుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు.. వీధి కుక్కల వల్ల అధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ, నీలాంటి వాళ్ళు వీధి కుక్కలను అదుపు చేయనీయకుండా కేసులు వేసి అడ్డుకుంటున్నారు. దాంతో సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది అంటూ ర‌ష్మీపై మండిప‌డుతున్నారు.

ఇక ఒక నెటిజ‌న్ ఏకంగా హ‌ద్ద‌లు దాటి `కుక్క రష్మీని కుక్క‌ను కొట్టిన‌ట్లు కొట్టాలి’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు. దీనిపై ఆమె కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. `కచ్చితంగా అలాగే చేద్దువు. నీ అడ్రస్ చెప్పు. నేను వ‌స్తాను. చూస్తా నువ్వేం చేస్తావో. ఇది నా ఓపెన్ ఛాలెంజ్` అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ర‌ష్మీ పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. మొత్తానికి టైం, ప్లేస్ చెప్పు కొట్టేసుకుందాం అంటూ ర‌ష్మీ స‌వాల్ విస‌ర‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.