వావ్: మరో పాన్ ఇండియా సినిమాలో అల్లు అర్హ.. బుడ్డది భలే ఆఫర్ పట్టేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ సర్వసాధారణం .. ఇప్పుడున్న ప్రజెంట్ స్టార్ హీరోస్ అందరూ తాతల పేర్లు నాన్నల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలుతున్న వాళ్లే ..ఎక్కడో వందలో ఒకరు సొంత టాలెంట్ పై ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా స్టేటస్ సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు చేస్తున్నారు . అయితే రాబోయే తరానికి కూడా ప్రజెంట్ ఉండే హీరోలు తమ వారసులని దింపడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు . ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార , అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సినిమా ఇండస్ట్రీలో తమ ఎంట్రీని ఫిక్స్ చేసుకున్నారు .

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పటికే సమంత హీరోయిన్ గా నటిస్తున్న శాకుంతలం సినిమాలో చైల్డ్ యాక్ట్రెస్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి హ్యూజ్ పాజిటివ్ కామెంట్స్ అందుకుంది . రీసెంట్ గానే అల్లు అర్హా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసింది . దీంతో కూతురు ఫస్ట్ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ – అల్లు స్నేహారెడ్డి . తమ కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ని చూసి మురిసిపోతున్నారు . కాగా ఇలాంటి టైం లోనే అల్లు అర్హ మరో సినిమాలో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది .

అయితే ఈసారి సొంత తండ్రితోనే అల్లు అర్హ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందన్న న్యూస్ అల్లు ఫాన్స్ కు పూనకాళ్లు తెప్పిస్తుంది . అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పుష్ప సినిమా కి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందె. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాగా పుష్ప 1లో పుష్పరాజ్- శ్రీవల్లి పెళ్లి చేసుకుంటారు .

సీన్ కట్ చేస్తే పుష్ప2లో శ్రీవల్లి – పుష్పకు ఒక బేబీ పుడుతుంది. ఆ బిడ్డ రోల్ లోనే అల్లు అర్హ నటిస్యుందట. అంటే రియల్ లైఫ్ లో తండ్రి కూతుర్లుగా ఉన్న బన్నీ – అల్లు అర్హ .. రీల్ లైఫ్ లోను తండ్రి కూతుర్లుగా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్హ – అల్లు అర్జున్ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు , ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం సిల్వర్ స్క్రీన్ పై ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. అల్లు అర్హ – అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కి బాక్స్ ఆఫిస్ షేక్ అయిపోవాల్సిందే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)