బాల‌య్య వీర‌సింహారెడ్డి హిట్ అవుతుందా.. డైరెక్ట‌ర్ గోపీచంద్‌పై అనుమానాలు..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత తను నటిస్తున్న అప్ కమింగ్ కమర్షియల్ మాస్ సినిమా వీర సింహారెడ్డి ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో ఈ సినిమా పై రోజురోజుకీ భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Veera Simha Reddy Blows Conch For Sankranthi War

అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో అందరికీ ఉన్న ఓ డౌట్ గోపీచంద్ మాలినేని. తన కెరిర్‌లో మొదటిసారిగా బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్.. అసలు బాలయ్యను ఏ స్థాయిలో వాడుకున్నాడు.. ఏ రేంజ్ లో ఆయనతో యాక్షన్ చేపిస్తాడని అనుమానాలు అందరిలో ఉన్నాయి.. ఈ క్రమంలోనే బాలయ్యతో అదిరిపోయే మాస్ కంటెంట్ సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి బాలయ్యను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటికి మాత్ర‌మే సాధ్యం అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు.

అయితే బోయపాటిలా బాలయ్యను గోపీచంద్ హ్యాండిల్ చేశాడా?అనే అనుమానాలు కూడా ఫాన్స్ లో ఉన్నాయి.ఇప్పటికే టీజర్ లో మాస్ గెటప్ యాక్షన్ సీన్స్ చూస్తుంటే బాలయ్యతో మరో బ్లాక్ బస్టర్ కొడతాను అనే సంకేతాలు ఇస్తున్నాడు.పైగా గోపీచంద్ లేటెస్ట్ ట్రాక్ లో వచ్చిన క్రాక్ పెద్ద హిట్టయింది. మరి బోయపాటి తర్వాత బాలయ్యతో ఆ రేంజ్ మాస్ హిట్ కొట్టే దర్శకుడిగా గోపీచంద్ పేరు వినబడుతుందా ? లేదా అనేది జనవరి 12తో తెలిపోనుంది. అప్పటి వరకూ గోపీచంద్ మ‌లినేని మీద కొన్ని సందేహాలు అనుమానాలు కలగడం స‌హ‌జం.