చిరంజీవి- అల్లు అరవింద్ ఎందుకు సినిమా చేయటం లేదు… కారణం అదేనా..!?

ఎంతోకాలంగా మెగా అభిమానులందరూ మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ బ్యానర్గీతా ఆర్ట్స్ లో చిరు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఇప్పటినుంచో అందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అరవింద్ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన అల్లు అరవింద్ కూడా అక్కడ ఈ విషయంపై స్పందించాడు. చిరు బాలయ్య తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా తీస్తాడా లేదా అనే దానికి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

అలా అని మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఏమైనా విభేదాలు వచ్చేయని అనుకుందామంటే ఈ మధ్యనే క్రిస్మస్ వేడుకల్లో అందరూ కలిసి చిరు ఇంట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో మెగా, అల్లు హీరోలు అందరూ కలిసి కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే చిరంజీవి- అల్లు అరవింద్ బ్యానర్ లో మాత్రం ఎందుకో సినిమా తీయడానికి సన్న హాలు జరగటం లేదు అనే విషయం అభిమానులకు మాత్రం అర్థం కావటం లేదు.

చిరంజీవి రీయంట్రీ తర్వాత మాత్రం తన ఓన్ బ్యానర్ అయ‌న కొణిదల ప్రొడక్షన్స్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ప్రస్తుతం చిరంజీవి చేతులో చాలా సినిమాలే ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.

Chiranjeevi - Allu Aravind: టాలీవుడ్ బావ బామ్మర్థులు.. చిరంజీవి, అల్లు  అరవింద్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే.. | Chiranjeevi Allu Aravind  Tollywood Mega Blockbluster ...

ఈ సినిమా తర్వాత యువీ క్రియేషన్స్, డివివి దానయ్య వంటి అగ్ర నిర్మాతలతో కూడా చిరంజీవి సినిమాలు లైన్ లో ఉన్నాయి. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బ్లాక్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కూడా ఒక సినిమా లైన్ లో పెట్టారు. ఇప్పుడు దాదాపు అందరితో సినిమాలు చేస్తున్నారు కానీ అల్లు అరవింద్ తో ఎందుకు సినిమా చేయటం లేదని ఇప్పటికీ అభిమానులకు అర్థం కావట్లేదు.