ఎవరు ఊహించిన స్కెచ్ తో కొరటాల.. ఈ దెబ్బతో చిరంజీవి కూడా నోరు మూయాల్సిందే..!

మిర్చి సినిమాతో దర్శకుడుగా పరిచయమైన కొరటాల శివ వరుస విజయాలతో టాలీవుడ్ లోనే స్టార్ట్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమా తీసి భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమాతో ఆయన లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ చిరంజీవి- కొరటాలకి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూ.. నేను కొరటాలని అనలేదంటూ వివరణ ఇస్తూనే ఉన్నాడు.

చిరంజీవి ఎన్ని మాటలు అన్నా కొరటాల మాత్రం మౌనముని లాగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల-ఎన్టీఆర్ తో ఓ సినిమా మొదలు పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్.. కొరటాల మూవీ పూజా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించినట్టు తెలుస్తుంది. దీంతో ఇటు నందమూరి ఫ్యాన్స్ అటు మెగా ఫాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే బాబాయ్ బాలయ్య అన్ స్టాపబుల్ షో లో సందడి చేయగా.. ఇప్పుడు అబ్బాయి చేయబోయే సినిమాకు చీఫ్ గెస్ట్ గా రాబోతుండటంతో ఇటు నందమూరి అభిమానులు మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్- ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన అరవింద సమేత పూజ కార్యక్రమాలకి కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా ఎన్టీఆర్‌కు సూపర్ హిట్ గా నిలిచింది.

Koratala Siva: పవర్ స్టార్ కోసం కథ రెడీగా ఉంది.. ప్రభాస్‌తో మరో సినిమా.. ఆచార్య ప్రమోషన్స్ లో కొరటాల శివ .. | Acharya Director Koratala Siva interesting comments on NTR, Pawan ...

ఇక ఇప్పుడు రెండోసారి కూడా పవన్ కళ్యాణ్- ఎన్టీఆర్ సినిమాకు ముఖ్య అతిథిగా రావడంతో ఈ సినిమా కూడా మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. వీటితోపాటు చిరంజీవి- కొరటాల మధ్య జరుగుతున్న ఇష్యూ కూడా సదుబాటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.