బర్తడే స్పెషల్: చరణ్ కి వరుణ్ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసి మరీ తమ్ముడికి ఇచ్చాడు..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే ఫ్రెండ్స్, రిలేటివ్స్, మెగా హీరోస్, హీరోయిన్స్ అందరూ వరుణ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు వరుణ్ తేజ్ కు స్పెషల్ గా విష్ చేశాడు రామ్ చరణ్ .

మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు పేరు కి బ్రదర్స్ అయిన మంచి క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉంటారు . అలాగే చిరంజీవి కొడుకు చరణ్ .. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా పేరుకు బ్రదర్స్ అయినా.. సరే బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా క్లోజ్ గా చిల్ అవుతూ.. ఒకరికిఒకరు పర్సనల్ అన్ని షేర్ చేసుకుంటూ .. లైఫ్ లో తప్పు ఒప్పులను సరిచేసుకుంటూ ఉంటారు . ఈ క్రమంలోనే చిన్నప్పుడు చరణ్ .. వరుణ్ ని ఎత్తుకుని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ..హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ స్పెషల్ విషెస్ అందజేశారు.

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడ్డింది. వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఫిదా సినిమాలో మొదట హీరోగా అనుకునింది రామ్ చరణ్ నే అట.. అయితే శేఖర్ కమ్ముల తన వద్దకు వచ్చి స్టోరీ చెప్పగానే ఈ కథ నాకంటే వరుణ్ తేజ్ కి బాగుంటుంది అంటూ స్పెషల్ గా ఫిదా సినిమా స్టోరీ ను వరుణ్ తేజ్ చేసేలా ప్రోత్సహించాడట . ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఫిదా సినిమాను చేసి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . వీళ్లిద్దరు బ్రదర్స్ కన్నా మంచి ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణనే చాలు అంటూ మెగా ఫాన్స్ వరుణ్ తేజ్ కి హ్యాపీ బర్త డే అంటూ విష్ చేస్తున్నారు.