సమంత “శాకుంతలం” హిట్ అయినా ఫ్లాపే.. ఎందుకంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రస్తుతం శాకుంతలం అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది . విడాకులు తర్వాత సమంత నటించి రిలీజ్ కాబోతున్న మూడో చిత్రం ఇది . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో సమంత పై హ్యూజ్ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో విడాకులకు ముందే ఓ సినిమాకి సైన్ చేసిన సమంత .. విడాకులు తర్వాత మరికొంత షూటింగ్ ని కంప్లీట్ చేసి ఎట్టకేలకు సినిమాను సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

కాగా ఇన్నాళ్లు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానులకు శాకుంతలం టీం గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న 2023న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది . కాగా ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . అయితే సినిమా పై ఇప్పటివరకు ఉన్న టాక్ ప్రకారం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్న .. సినిమా హిట్ అయినా సరే అది ఫ్లాపే అంటూ సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

ఇది మొత్తం శకుంతల దేవి – దుష్యంతుడి కథ అని అందరికీ తెలిసిందే . మన తాత ముత్తాతల దగ్గర నుండి ఈ కధ ని చెప్పుకుంటూనే ఉన్నాం . అయితే అందరికి తెలిసిన కథనే మళ్లీ గుణశేఖర్ ఏం చెప్తాడు ..పైగానే ట్రాక్ రికార్డ్ లేని డైరెక్టర్.. ఏ రేంజ్ లో తెరకెక్క్కించిన ఫ్లాప్ డైరెక్టర్ గానే పేరు సంపాదించుకుంటాడు తప్పిస్తే హిట్ డైరెక్టర్గా మారడు . అదే కాకుండా సోషల్ మీడియాలో సమంత పై నెగిటివ్ ట్రోలింగ్ ఇంకా జరుగుతూనే ఉంది . సమంత ఎంత బాగా నటించినా .. తిప్పితిప్పి కొట్టిన అదే స్టోరీని తీస్తాడు తప్పిస్తే క్లైమాక్స్ లో ఏమి ట్వీస్ట్ పెద్దగా పెట్టలేడు.

దీనికోసం సినిమాని చూడాలా అంటూ జనాలను స్కిప్ చేసే అవకాశం ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే సమంత ఏదో మాయ చేసి జనాలను సినిమా థియేటర్స్ కి రప్పించాలి తప్పిస్తే ..లేకపోతే సినిమా పై జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేరు అంటూ కొందరు జనాలు ఆమెపై నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే శాకుంతలం సినిమాపై సోషల్ మీడియాలో భిన్న విభిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)